A husband who scolds his wife
- Mind and Personality Care

- Feb 21, 2023
- 2 min read
భార్యను తిట్టిపోసే భర్త

వంట సరిగ్గా లేకుంటే చటుక్కున భార్యను ఛ...ఏంటా వంట...అసలు జంతువులైనా తింటాయా అని విసుక్కునే సగటు భర్తలు.
ఉదయాన్నే చపాతీ మృదువుగా లేదని మెత్తని మాటలతో కాకుండా పరుషపద జాలంతో భార్యను తిట్టిపోసిన భర్త అతను.
కానీ ....
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం జీవితంలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను ఓ పత్రికలో చదివిన ఆ భర్తలో వచ్చిన మార్పు ఇది...
అబ్దుల్ కలాం మాటల్లో...ఆయన యవ్వనంలో ఉన్న రోజులవి.....
నా చిన్నతనంలో...ఓ రోజు రాత్రి వేళ అది. చాలాసేపు ఆ పనులు ఈ పనులు చేసిన తర్వాత మా అమ్మ ఆరాత్రి రొట్టెలు చేసింది.
మా అమ్మ కూడా కుటుంబ పోషణకోసం పనికి వెళ్తుండేది.
ఓ మాడ్చిన రొట్టెను నా కళ్ళ ముందే మా నాన్నకు పెట్టింది అమ్మ.
కానీ మా నాన్న ఆ మాడిన రొట్టెకు ఏ మాత్రం విసుక్కోకుండా తినేసారు.
ఈరోజు స్కూల్లో ఎలా గడిచిందిరా అని మా నాన్న నన్ను అడిగారు.
నేనా రోజు ఏం చెప్పానో తెలీలేదు.
కానీ మా నాన్నకు మాడ్చిన రొట్టె పెట్టినందుకు మా అమ్మ తనను క్షమించమని అడిగింది. బాధపడింది.
కానీ మా నాన్న, నీకు తెలుసుగా, నాకు మాడిన రొట్టే ఎక్కువ ఇష్టమని....ఎంత బాగుందో తెలుసా అని మా అమ్మతో చెప్పడం నాకిప్పటికీ గుర్తు.
తినడమంతా అయిపోయిన కాస్సేపటికి నేను మెల్లగా మా నాన్న దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఒకింత జంకుతో అడిగాను.
నాన్నా, మీకు నిజంగానే మాడిన రొట్టె అంటే చాలా ఇష్టమా అని.
కాస్సేపు మౌనంగా ఉన్న మా నాన్న నన్ను గట్టిగా కౌగిలించుకుని చెప్పారు...
ఒరేయ్, మీ అమ్మ రోజూ పనికి వెళ్ళి ఇంటికొచ్చి మనకూ సపర్యలు చేస్తోంది. ఆమె ఎంతగానో అలసిపోయి ఉంటుంది. ఓ మాడిన రొట్టె ఎవరినీ గాయపరచదు. కానీ పరుషపదజాలం కచ్చితంగా ఎటువంటివారినైనా గాయపరుస్తుందిరా.... నేనేమీ గొప్పవాడిని కాను. కానీ అందుకు ప్రయత్నిస్తున్నాను.... ఇన్నేళ్ళల్లో నేను నేర్చుకున్నదిదే ...జరిగేది ఏదైనాసరే దానినలాగే స్వీకరించి సంతోషకరమైన మానసిక స్థితికి మనం మారడమే. అది తప్పదన్నారు మా నాన్న.
దీంతో కలాంకు ఆయన తండ్రి మీద అంతులేని అభిమానం, మర్యాద కలిగాయి. అవి ఇప్పటికీ ఆయనతో వస్తూనే ఉన్నాయని రాసుకున్నారు.
మాడిన రొట్టె ఎవరినీ గాయపరచదు కానీ పరుషపదజాలం కచ్చితంగా గాయపరుస్తుంది. అన్నం తినడానికి కూర్చున్నప్పుడు తనకు వడ్డించిన అన్నం, కూర పప్పు కాస్త చల్లారినప్పటికీ భర్త ఏమీ అనకోడదూ. కోపంతో రెచ్చిపోవద్దు. భార్యను పల్లెత్తు మాట అనకూడదని భర్త అనుకోవాలి .
మున్ముందు మన పిల్లలు కూడా కలాం ఆశయాలను పాటించాలి.
మనమూ కలాంగారి తండ్రి తత్వాన్ని అనుసరించవచ్చుగా.
నేనేమీ గొప్ప మనిషిని కాదు కానీ అందుకు ప్రయత్నిస్తాను అని ప్రతి భర్త అనుకోవాలి.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్, గైడెన్స్, సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్
@ 9390044031/40

Comments