"Win your heart... and the world will follow."
- Mind and Personality Care

- May 6
- 1 min read
"మన గుండెను గెలిస్తే... ప్రపంచం మనదే!"
"మాట చెప్పాలనుకున్నా... మాట తప్పిపోతుంది!
మాట వినాలనుకున్నా... అర్థం మళ్లిపోతుంది!
అది కమ్యూనికేషన్ లో కాదు ...
మనసులో క్లారిటీ ఉండాలి!
మనవాళ్లే అనుకున్నాం...
ఒక రోజు తెలిసింది — మనసు కంటే ముఖాలు తొందరగా మారిపోతాయని!
మన దారి సరిగ్గా ఉందని నమ్మాం...
గమనించరా... నిజమైన దారి కనబడేది మధ్యలోనే... తడబడినప్పుడు!
ప్రేమ చూపాలనుకున్న చోట... మాటల మౌనం మిగిలింది!
కోపం చూపించాల్సిన టైమ్ లో... గుండె వెనక్కు తగ్గింది!
అది మిగతావాళ్ల వల్ల కాదు ...
మన మౌనతనమే మన అపజయం!
మన మనసు ఏం కోరుకుంటుందో మనకే
తెలియని అయోమయం!
ఆయుష్మాన్ భవ అని ఆశీర్వాదం ఇచ్చే వయసు వచ్చేస్తుంది!
సూర్యుడు మారుతున్నాడు...
చంద్రుడు మారుతున్నాడు...
కాలం జిప్ జిప్ అని పరుగెడుతుంది...
మనమే అక్కడ... నిల్చొని మిగిలిపోతున్నాం!
కాలం లెట్ కాదు...
రోజులు పేజీలు తిప్పుతూ ముందుకెళ్తున్నాయి!
మన జీవిత పుస్తకం లో... నాలుగు పేజీలు కూడా మనమే రాయాలి!
ఇది ఎవరి బాధ్యత కాదు... మన బాధ్యత!
నవ్వాలంటే అవకాశం కాదు... ధైర్యం కావాలి!
బాధను తుడవాలంటే... సమయం కాదు... మనసు కావాలి!
ఏడవాలంటే... హృదయం వెనుకాడుతుంది!
ప్రపంచం అందం చూడాలంటే... ముందు మనసు స్వచ్ఛంగా ఉండాలి !
స్వార్థం కడిగేస్తే... సంతోషం ఒంటరిగా వచ్చేస్తుంది!
మొదట మన మనసు గెలవాలి... తర్వాత ప్రపంచం గెలుచుకోవచ్చు!
మనోబలం పెంచుకోండి... మంచి పుస్తకాలు చదవండి.. ప్రపంచం మొత్తం తిరగండి.... నిజాయితీగా నవ్వండి...
మాటల కంటే మనిషి విలువను గౌరవించండి!
అప్పుడే జీవితమే మన సినిమా అవుతుంది!
అందులో మనం దర్జాగా బ్రతుకుతాం...
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్
@ 9390044031




Comments