ADMIRE
- Mind and Personality Care

- Jul 29, 2023
- 1 min read
ఆరాధన
పూర్వం ఓ నానుడి ఉంది. అదేంటంటే, నా సొంత ఇల్లు స్వర్గంలో ఉంది.. నేను ఈ భూమ్మీదకు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చా..!
నేను విశ్రాంతి తీసుకోవడానికి, ఆడుకోవడానికి, ఇక్కడ ఏం జరుగుతుందో గమనించడానికి ఈ ప్రపంచానికి వచ్చాను.
మన చుట్టూ ఏం జరుగుతోందో నిశితంగా గమనిస్తే అదే ఈ ప్రపంచంలోనూ ఓ గొప్ప విషయం అవుతుంది.
ఆధ్యాత్మిక సాధన మరీ అంత భారంగా ఉండకూడదు. అటువంటి సాధన ఒకింత స్వతంత్ర భావన కలిగి ఉండాలి.
అన్ని ఆధ్యాత్మిక బోధనలు ప్రేమతోనే ప్రారంభమవుతాయి. మనం చేసే పని ప్రేమతో చేస్తే అప్పుడక్కడ బలవంతాలనేవి ఉండవు.
ఆఫీసు పని కానీ లేదా ఆలయంలో పూజ కానీ ఎక్కడైనా ఇష్టపూర్వకంగా చేయాలి. ఇవిరెండూ ఒకటే.. కర్తవ్యం పూజలాంటిదే అవుతుంది. ఇది అనుభవమైనప్పుడే ఆ వాస్తవం తెలుస్తుంది. అటువంటి స్థితిని అనుభవించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు.
మన జీవిత మార్గమే ఒక ఆరాధన. మన శ్వాసే ఓ ఆరాధన.శమన సత్కర్మలన్నీ ఆరాధనకిందకే వస్తాయి. మన హృదయం కృతజ్ఞతతో పంచభూతాలను తలచుకుంటే మనం చూసేదీ.. చేసేదీ ఆరాధనే అవుతుంది.
ఒక పని చేయవలసివచ్చినప్పుడు ఇష్టంతో చేయాలి తప్ప ఎందుకొచ్చిన కర్మరా..? అని నీరసంగా చేస్తే అదెందుకూ పనికిరానిదే అవుతుంది. అందుకు సంబంధించిన ఫలితాలు కూడా అదేవిధంగా ఉంటాయి. దీని వల్ల మన సమయమూ వృధా అవుతుంది. కాబట్టి చేసేదేదో ఇష్టంతో చేయడం అలవరచుకోవాలి.
మొదట్లో కష్టంగా ఉన్నా అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా అంతా బాగానే అనిపిస్తుంది.
మనం ఒక సముద్రం దగ్గర నిలబడి దాని అపరిమితమైన విస్తీర్ణం, దాని లోతు, దాని తరంగాలను గమనిస్తే, మన హృదయ లోతుల్లో ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది.
అది కూడా ఓ విధమైన ఆరాధనే...
ఇదేమీ పెద్ద కష్టమైంది కాదు. ఒక సాధారణ అవగాహన, స్పష్టత. దీన్ని ప్రయత్నించాలి. అది మన చుట్టూ విస్తరిస్తుంది. ప్రేమ భావాలు ప్రతి ఒక్కరినీ ప్రేమతో నడిస్తాయి. ప్రేమలో ముంచెత్తేలా చేస్తాయి.
మనలోని మంచిని, ప్రేమను గుర్తించకుండా బయట వెతకటం అనేది కొనసాగుతూనే ఉంది.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్
@ 9390044031/ 40









Super madam. I admire ur humble ness.u are