"Are couples spending their lives only on work?"
- Mind and Personality Care

- Sep 8, 2024
- 3 min read
*దంపతుల్లారా పని తోనే జీవితాన్ని గడిపేస్తున్నారా*
అయితే చదివేయండి
చిన్నతనంలో నా స్నేహితురాలు మాధురి చాలా ఉషారుగా, చలాకి గా ఉండేది. బాగా చదివేది. ఇంకా అందరూ నన్ను అబ్బా ఏమి మాట్లాడదూ అని ఎగతాళి కూడా చేసేవారు. అది పక్కన ఉంటే చాలు....ఎందుకో నాతోనే ఎక్కువ స్నేహంగా ఉండేది.ఎక్కడి కెళ్ళినా కలిసే వెళ్లేవారం. పదవతరగతి లోనే పెళ్లి చేసారు . తర్వాత నాతో చాలా తక్కువ మాట్లాడేది. సంసారం అన్నాక ఇలాగే ఉంటుంది అని అనుకున్నాను.
ఒకసారి మా ఇంటికి వచ్చి మా ఆయన నాతో మాట్లాడినా, ఎక్కడికి తీసుకెళ్ళినా అత్తమామలు, మరిది ఆడబిడ్డ ఏదో వంకతో గొడవ చేసేవారిని..
మీరు ఇంట్లో లేకపోతే మాకు బెంగగా ఉంటుంది అని అనేవారట. భర్త ఏమి అనలేక మౌనంగా ఉండేవాడు. మా స్నేహితురాలు అమ్మని నేను అప్పుడప్పుడు కలవడానికి వెళ్లినప్పుడు మాధురిని ఒక్కసారి కూడా పంపరూ.. అని బాధ పడి నీవైనా రామ్మ అనేవారు. ఆవిడా బాధతో కొంత కాలానికి చనిపోయారు.
నా స్నేహితురాలు భర్త పిల్లలకి, తల్లి దండ్రులకి, అత్త మామ, మరిది, ఆడబిడ్డల కి 24 గంటలు కావలసినవి అన్ని ఏర్పరుస్తూ క్షణం తీరిక లేకుండా జీవితాన్ని అలా గడిపిస్తూ ఉండేవారు. వారు ఎక్కడికైనా వెళ్లాలనుకున్న ఎవరన్నా వచ్చి రమ్మన్నా కూడా ఆ ఇంట్లో వాళ్ళ నోటి వెంట ఇదిగో ఇలాంటి మాటలు వచ్చేవి ...*
ఆవిడ, ఆయన లేకపోతే మాకు క్షణం గడవదు ..అని తల్లి దండ్రులు,అత్తమామలు, అమ్మ ప్లీజ్ నువ్వు పెడితే మాకు ప్రాబ్లం అవుతుంది వద్దు అని పిల్లలు ..
వారి చిన్న చిన్న ఆనందాలు కూడా ఎప్పుడూ అనుభవించిన దాఖలాలు లేవు..
ఇలా వారి చిన్న స్వేచ్ఛకి కూడా ఎన్నో ఆటంకాలు వారు లేకపోతే మాకు జీవితమే లేదు అన్నట్టు ప్రతి క్షణం చుట్టూ తిరుగుతూ వాళ్ళ అవసరాలన్నీ గడుపుకుంటూ పోతూ ఉన్నారు ఆ కుటుంబాంలో వ్యక్తులందరూ..
కాలం ఎవరికోసం ఆగదు జరిగిపోతూనే ఉంటుంది ప్రతిక్షణం ప్రతి నిమిషం ఆ ఇంట్లో ఒక యంత్రంలా ఆ బిడ్డలకు ఒక తల్లిలా , తండ్రిలా, తల్లి దండ్రులు లకూ, అత్తమామలకు సేవ చేస్తూ క్షణం తీరిక లేకుండా
ఆవిడ, ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నారు
చాలా రోజులు అలా గడిచిపోయాయి ఒకరోజు సడన్గా
ఒక వార్త విన్నాను.. వారిద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారని... ఒక్క నిమిషం కాలమాగిపోయినట్టు అనిపించింది ఇలా ఎలా జరిగింది అని చాలా బాధపడటం
నాకు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ధైర్యం సరిపోలేదు వారు లేకపోతే ఆ ఇంట్లో పరిస్థితి తలుచుకుని కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత తప్పదు ఎప్పటికైనా ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేయాలి అనుకుంటు వాళ్ళింటికి వెళ్ళాము.
మరి ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఎలా ఓదార్చాలో అని మేము ఎంతో మానసికంగా టెన్షన్ పడుతూ డోర్ తట్టాం
పిల్లలు వచ్చి తలుపు తీశారు ఈ లోపు మేము అడుగుతున్నాం తాతా నానమ్మ ఉన్నారా అని ఆ ఉన్నారు అని చెప్పి పిల్లలు ఎంతో బిజీగా ఉన్నట్టు వాళ్ళ తాతని పిలిచి లోపలికి వెళ్ళిపోయారు
ఆయన వచ్చి లోపలికి రమ్మని ఆహ్వానించారు లోపలికి అడుగు పెడుతూ చుట్టూ పరికించి చూసాం
ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది వాళ్లకి ఒక పాప ఒక బాబు అసలు ఇంట్లో ఏమి జరగలేదు అన్నట్టే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు
అత్త మామ టిఫిన్ కార్యక్రమాలు అయిపోయినట్టు ఉన్నాయి విశ్రాంతి తీసుకుంటున్నారు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అలా కాసేపు వాళ్లకి మాకు మధ్య నిశ్శబ్దం ఎంత సేపు కూర్చున్నమో....
పలకరించడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు మెల్లగా గొంతు పెగిలించుకుంటూ ఎలా ఉన్నారు మీరు అని అడిగాము ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అంటూ పలకరించాం ఎదురుగా గోడకి వేలాడుతున్న వారి ఫోటోని చూస్తూ..
అయన మెల్లగా ఇలా అన్నారు ఏముందండి పిల్లలిద్దరూ జాబ్స్ కి వెళ్ళిపోతారు వంట చేయడానికి మనిషి పెట్టుకున్నాము గిన్నెలు బట్టలు క్లీనింగ్ కోసం మనిషిని పెట్టుకున్నాము ఇబ్బంది ఏమీ లేదు కాలమలా గడుస్తుంది అన్ని టైంకి సక్రమంగా జరుగుతున్నాయి అన్నారు..
అప్పటివరకు వారు లేకపోతే జరగదు కాలమాగిపోతుంది అంటూ వారిని బాధ్యతలతో నిర్బంధించిన ఆ మనుషులు .. వారు లేకపోయినా అన్ని రకాలుగా వాళ్ళ కార్యక్రమాల్ని నడిపించుకుంటూ బ్రతికేస్తున్నారు..
ఇప్పుడు ఇక్కడ ఈ విషయము ఎందుకు ప్రస్తావించానంటే కొంతమంది భార్యా భర్తలు మేము లేకపోతే కుటుంబం ఏమైపోతుందో అంటూ ఒక్కరోజు ఏ ఫంక్షన్ కి వెళ్లకుండా, వాళ్ల ఆనందాలను ప్రక్కన పెట్టి..వాళ్ళ కోసం అంటూ సమయాన్ని కేటాయించుకోకుండా బ్రతికినన్ని రోజులు కుటుంబంలోని వ్యక్తుల కోసం బతుకుతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయాక
అవతల వాళ్ళ లోకమేమీ ఆగిపోదు. వాళ్లు ఆగిపోరు వాళ్ళ పనులు వాళ్ళ అవసరాలు అన్ని జరిగిపోతూనే ఉంటాయి
మనిషి జీవితాన్ని స్వేచ్ఛ లేకుండా బంధాల మధ్య ఒక ఖైదీల బ్రతుకుతో జీవితాన్ని అలాగే ముగిస్తే ఇలాగే ఉంటుంది
వాళ్లు వారిని మిస్ అవుతున్నారా లేదే ఎక్కడ మిస్ అవుతున్నారు ఎక్కడ లేదా? అప్పుడు వారితో చేయించుకున్నారు ఇప్పుడు పని వాళ్ళతో చేయించుకుంటున్నారు అంతే తేడా
ఈ మాత్రం దానికి మనం ఎంతలా హైరానాపడిపోతాం
ప్రతి కుటుంబంలో జరిగే కథ ఇదేగా ఇవన్నీ పక్కన పెట్టి ఉన్న నాలుగు రోజులు సంతోషంగా బ్రతకడానికి * భార్య , భర్త ప్రయత్నం చేయండి* మేము లేకపోతే వీళ్ళు ఏమైపోతారు బ్రతికుండగానే అన్నీ చేసేయాలి అనే ఆరాటాలని పక్కనపెట్టి ..
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్
@ 9390044031







Comments