Do you impose your views on children?.....
- Mind and Personality Care

- Feb 9, 2023
- 2 min read
పిల్లల మీద మీ అభిప్రాయాలను రుద్దుతున్నారా?
ఒక ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు అణకువకు పెట్టింది పేరు. తండ్రి ఏది చెప్పినా వింటాడు. పెద్దవారి పట్ల ఎంతో వినయంగా ఉంటాడు. చిన్నవాడు అలా కాదు. తాను అనుకున్నదే చెప్తాడు. చేస్తాడు. ఇతరులు చెప్పేది వినడు. ఎవరికి తల వంచి నడవడు. వాడి నడత నడక వేరు.
ఈ ఇద్దరిలో మీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే"పెద్దవాడంటే ఇష్టం. ఎందుకంటే అతను పెద్దలు చెప్పిన మాట విని నడచుకుంటున్నాడు" అని చెప్తారు.
కానీ
ఓ పిల్లాడిని అతని తెలివితేటలకు విలువ నివ్వలి.
అంతే తప్ప పెద్దల మాట వినడం లేదని వాడిని చిన్నచూపు చూడకూడదు.
మన పిల్లలు వారంతట వారు ఆలోచించడానికి విడిచిపెట్టం. అసలలాంటి అవకాశం ఇవ్వం.ఇతరులను చూసి కాపీ కొట్టేవారిని అంటే అనుసరించడాన్నే నేర్పిస్తాం.
ప్రసిద్ధి చెందిన కొందరి పేర్లు చెప్పి వారిలా నువ్వయి పోవాలంటాం. వారిలా ఎదగాలంటాం.ఈ క్రమంలో పిల్లల మానసిక ఎదుగులకు మనం అడ్డంకిగా ఉంటాం.
ఓ పిల్లాడిలో అనవసరంగా నమ్మకాన్ని పెంచకూడదు. ఏ నిబంధనలనూ రుద్దకూడదు బలవంతంగా. మనం అప్పటికే కొన్ని అర్థంపర్థం లేని అభిప్రాయాలను, ఆశయాలను మనసులో ఉంచుకుంటాం.
ఈ ప్రపంచానికి కొత్తగా వచ్చే పిల్లాడి స్వచ్ఛమైన మనసులో మన అభిప్రాయాలను పరిచయం చేయడానికి, రుద్దడానికి మనకు ఎటువంటి అధికారమూ లేదు.ఓ పిల్లాడిని నువ్వు హిందూ మతానికి చెందిన వాడివని పుట్టడంతోనే ఓ ముద్ర వేస్తాం. ఇది వాడి స్వతంత్రతను ఆదిలోనే అంటే మొగ్గలోనే తుంచేయడంతో సమానం.
మీరు ఓ మతానికి సంబంధించిన విధానాలను పాటిస్తూ వస్తున్నారు. ఆ దారిలోనే పోతున్నారు. మీకు ఆ మార్గం నచ్చింది. అందువల్ల ఆ దిశలో పోతున్నారు. అలాగని....మీ పిల్లలనూ ఆ దారిలోనే వెళ్ళమని చెప్పడం, బలవంతం చేసే హక్కు మీకెక్కడిది.
మనకు నిజంగానే మన పిల్లలమీద ప్రేమ ఉంటే ....ఇలా బలవంతం చేయకూడదు. వారికి స్వేచ్ఛతోపాటు ఆలోచించేందుకు అవకాశమివ్వాలి.అప్పుడురానున్న తరం అద్భుతమైన తరంగా రూపొందుతుంది.
మనమెలాగూ కులము, జాతి, మతము వంటి వాటికి చిక్కుకుపోయాం. తల్లడిల్లు తున్నాం ఇవతలకు రాలేక.వారినైనా తారతమ్యాలు లేని సమాజాన్ని చూడనిద్దాం.
అందుకు మనం ఏం చేయాలి...ఏమీ చేయకుండా ఉంటే చాలు.ఓ పిల్లాడిమీద మనమనుకున్నది బలంవంతగా రుద్దడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా...అది అతనిని అతని నుంచి దూరం చేస్తున్నట్టు అవుతుంది.
వ్యక్తిగతమేనదీ సొంతంగా ఆలోచించండం అనేదీ లేకుండా చేస్తున్నట్టు అవుతుంది.
అతనిని గిరి గీసి ఆ గీత దాటకుండా చేసినట్టవుతుంది.
చివరకు అతను ఓ తీవ్ర మతవాదిగా మారుతాడు.
ఇదంతా ప్రేమ అనే పేరిట పెద్దలు చేసే పెద్ద తప్పు.
ఇదంతా చెప్తుంటే విన్న ఈ కాలపు తండ్రి ఒకరు చెప్పారిలా...
నేను నా అభిప్రాయాలన్నింటినీ మా పిల్లాడి మీద రుద్దడం లేదండీ...కానీ ఎక్కువగా తినమని చెప్పి బలవంతం చేస్తాను అన్నాడు.
అంటే మీ ఇంటి వంట అంత రుచికరంగా ఉంటుందా అని అడిగాను.
అందుకు ఆయన జవాబిస్తూ వంట బాగుంటే నేనెందుకు తినమని బలవంతం చేస్తాను అన్నాడు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్, గైడెన్స్,సైకో థెరపీ, హిప్నో థెరపి@9390044031/40







Nice