Drugs destroying the lives of Youth.
- Mind and Personality Care

- Apr 4, 2022
- 3 min read
పిల్లల పెంపకం తల్లి తండ్రులకు ఒక సవాల్
యువతను చిదిమేస్తున్న ‘డ్రగ్స్’ సంస్కృతి డా.హిప్నో పద్మా కమలాకర్
• మత్తులో యువత జీవితాలు చిత్తు. • సరదాగా మొదలై... వ్యసనంగా మారి! • యువత జీవితాలను కబళిస్తున్న డ్రగ్స్. • విస్తరిస్తున్న చీకటి వ్యాపారం. • డ్రగ్స్‌టూర్స్ • చదువుల ఒత్తిడితో డ్రగ్స్. • తాత్కాలిక సంతోషం కోసం • ప్రలోభాలకు ఆశపడి.. • తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
డా. నాగేశ్వరి రావు,డా.హిప్నో పద్మా కమలాకర్, పి.స్వరూపరాణి, డా.వి.జే.ఇ.క్యార్లి ఉరకలెత్తే యవ్వనం, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కలలు, ఆశల పరంపర’.. యువత విషయంలో కలగానే మిగిలిపోతుంది. విస్తరిస్తున్న చీకటి వ్యాపారంమత్తులో జీవితాలు చిత్తు. భారత్‌లో ఎంతో విస్తృతమైన నిఘా వ్యవస్థలు ఉన్నప్పటికీ మాదకద్రవ్యాల ముఠాలు వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. యువకులను మత్తుకు బానిసలుగా మారుస్తూ వారి భవిష్యత్తుతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రపంచ మాదక ద్రవ్య నివేదిక-2020 ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మత్తుపదార్థాల వినియోగం ఏటా పెరుగుతోంది. గతంలో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో సుమారు మూడు వేల కిలోల హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ ఏకంగా 21 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఇంత పెద్దయెత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. వ్యవస్థల్లో డొల్లతనం, నగరంలోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన కొందరు విద్యార్థులు అధిక మోతాదులో మత్తు పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. కౌమారదశలో ఉన్నవారు, యువకులు మాదకద్రవ్యాలను అధికంగా వినియోగిస్తున్నారు. డ్రగ్స్ మాఫియాతో కొందరు రాజకీయ నాయకులకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆర్థిక లావాదేవీలు ఉండటంవల్లే కేసులు నీరుగారుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా నిజాయతీగా విధులు నిర్వర్తిస్తే మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగాలను సమర్థంగా కట్టడి చేయవచ్చు.అక్రమంగా ధనం సంపాదించి అడ్డదారిలో ఎదగాలని భావించే వారు మాదకద్రవ్యాల రవాణా వైపు మొగ్గు చూపుతున్నారు. ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలకు ఆర్థిక ఆటంకాలు ఎదురుకాకుండా ఈ చీకటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారే అధిక సంఖ్యలో ఉన్నారంటే ఆ రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల వ్యాపారం ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. అవగాహన కల్పించాలిమాదకద్రవ్యాలను అరికట్టేందుకు భారత సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ‘నశా ముక్త్ భారత్’ (వ్యసనం లేని భారతదేశం) ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం దేశంలో అధిక సంఖ్యలో మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లుగా గుర్తించిన 272 జిల్లాల్లో ఈ ప్రచారం కొనసాగుతోంది. దీన్ని ఇతర ప్రాంతాలకూ విస్తరించాలి. మాదకద్రవ్యాల వినియోగంవల్ల కలిగే చెడు ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. మత్తుపదార్థాల అక్రమ రవాణా, నిల్వకు సంబంధించి సమాచారం అందించే వారికి భద్రత కల్పించాలి. మాదక ద్రవ్యాల ప్రవాహాన్ని అరికట్టడానికి నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాల చట్టం-1985 అమలుకు- కస్టమ్స్, డీఆర్‌ఐ, పోలీస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సీబీఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, జాతీయ దర్యాప్తు సంస్థల సేవలను ప్రభుత్వాలు వినియోగించుకొంటున్నాయి. అయినా ఆశించిన ఫలితం లేదనడానికి భారీగా పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలే నిదర్శనం. భారత్‌లో ఎంతో విస్తృతమైన నిఘా వ్యవస్థలు ఉన్నప్పటికీ మాదకద్రవ్యాల ముఠాలు వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. యువకులను మత్తుకు బానిసలుగా మారుస్తూ వారి భవిష్యత్తుతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మధ్య తరగతి యువతీ, యువకులు ఎక్కువగా గంజాయి తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఉండి, పబ్బులకు వెళ్లేవాళ్లు కొకైన్, హెరాయిన్, ఓపీయం, ఎల్‌ఎస్‌డీ వంటి ద్రావణాలను తీసుకుంటున్నారు. ఆవేశంతోనో, ఆనందం కోసమో, థ్రిల్లింగ్ కోసం, సమ వయస్కుల ప్రభావం తో మొదలవుతున్న ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది. ఆ తర్వాత వారి భవిష్యత్‌నే కబళిస్తోంది. వారి జీవితాలను పాడుచేసుకోవడమే కాదు... మత్తులో వాహనాలు నడిపి ఇతరుల మరణానికీ కారణమవుతున్నారు. చాలా ఘటనల్లో పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడడానికి స్నేహితులు, తల్లిదండ్రులే కారణమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. • కొత్త ట్రెండ్‌గా డ్రగ్ టూర్స్ రాష్ట్ర పోలీసులు కొంతకాలంగా డ్రగ్స్ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. డ్రగ్ పెడ్లర్స్ కదలికలు, మాదకద్రవ్యాలు దొరకడం కష్టమవడంతో కొత్తగా ‘డ్రగ్ టూర్స్’పెరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్ వినియోగదారుల్లో చాలా మంది గోవాతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నారని అంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కసోల్ ప్రాంతంలో నిర్ణీత సందర్భాల్లో రేవ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారని.. దేశవ్యాప్తంగా ఉన్న డ్రగ్ వినియోగదారులు హాజరవుతున్నారని సమాచారం.
• మానసిక లక్షణాలివే.. మాదక ద్రవ్యాలు తీసుకున్న వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులుంటాయి. చిన్న విషయాలకు చిరాకు, కోపం తెచ్చుకుంటారు. వేళకు తినరు. ఒక్కోసారి అతిగా తింటారు. వ్యక్తిగత శుభ్రత ఉండదు. చదువు, పనితీరులో వెనకబడుతుంటారు. ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. పరధ్యానంలో ఉంటారు. విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తారు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. తల్లిదండ్రుల కళ్లల్లోకి సూటిగా చూడలేక పోతారు. ఇలాంటి లక్షణాలుంటే డ్రగ్స్ తీసుకుంటున్నారని అనుమానించొచ్చు.
• తల్లి తండ్రుల పర్యవేక్షణ అవసరం.. పిల్లలు ఎక్కడికి, ఎవరితో వెళ్తున్నారు? తిరిగి ఇంటికెప్పుడొస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు? ఎలాంటివారితో స్నేహం చేస్తున్నారు? చదువు వల్ల ఒత్తిడి పెరుగుతుందా? వంటి అంశాలు తెలుసుకోవాలి. లేదంటే పిల్లలు చేయిదాటిపోవడమే కాదు అసాంఘీక శక్తులుగా మారే ప్రమాదం ఉంది. • శారీరక లక్షణాలు: డ్రగ్స్ యువత ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతున్నాయి. నిరంతరం ముక్కు నుంచి నీరు కారడం, లోపల మంట, గొంతులో పుండ్లు, బొంగురు పోవడం, చర్మంపై దద్దుర్లు, కీలకమైన సిరలు దెబ్బ తినడం, మొదడు పోటు, నిద్రలేమి/అతినిద్ర వంటి సమస్యలు తలెత్తడం, రాపిడికి గురై పళ్లు పాడైపో వడం, గుండెపోటు, వాల్వ్‌లకు ఇన్‌ఫెక్షన్లు, రక్తకఫం, పిల్లికూతలు, ఆయాసం, ఉబ్బసం, నిమోనియా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
• డ్రగ్స్‌తో బ్రెయిన్ స్ట్రోక్ ఆల్కహాల్‌తోపాటు డ్రగ్స్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్‌తో రక్తనాళాలు వ్యాకోచించి, మెదడులో రక్తస్రావం అవుతుందని.. ఇది ప్రాణాలకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు పెరిగి.. తమ పనులను సక్రమంగా చేసుకోలేని స్థితికి చేరుకుంటారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ బాధితులు గుండెపోటుతో చనిపోతున్నారన్నారు. ఆల్కహాల్‌తో డ్రగ్స్ కలిపి తీసుకునేవారి సంఖ్య పెరిగిందని.. వారిలో చాలా మంది విద్యావంతులు కావడం, 29 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారే అధికంగా ఉండటం ఆందోళనకరమని చెప్పారు. కొకైన్, గంజాయిలను ఆల్కహాల్‌తో కలిపి తీసుకున్న యువకుడు ఇటీవల మెదడులో రక్తస్రావంతో చనిపోయాడని.. ఓ ఐటీ ఉద్యోగిని గంజాయికి అలవాటుపడి రెండుసార్లు బ్రెయిన్ స్టోక్‌కు గురైందని వివరించారు. డ్రగ్స్ వల్ల చేజేతులా జీవితాలను కోల్పోయే ప్రమాదముందని.. యువత ఆల్కహాల్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.
• ఊహాలోకంలో విహరించడం కోసం..
డ్రగ్స్ తీసుకున్న వారు ఊహా (మాయ) లోకంలో విహరిస్తుంటారు. దీన్నే యూపోరియా అంటాం. ఒకసారి ఈ భావన పొందిన వ్యక్తి మళ్లీ, మళ్లీ అలాంటి అనుభూతినే పొందాలని భావిస్తుంటాడు. ఉన్నత వర్గాల్లో ఈ సంస్కృతి విపరీతంగా పెరిగింది. డ్రగ్స్ వాడకంతో మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవి దొరక్కపోతే అసాంఘీక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడితే.. కౌన్సెలింగ్, సైకో థెరపీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ,హిప్నో థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ప్రక్రియల ద్వారా కాపాడుకోవచ్చు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటమే కాక, ఓపికతో మార్చుకోవాలి.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్
9390044031







Comments