Exciting and refreshing the employees through games.
- Mind and Personality Care

- Mar 10, 2022
- 1 min read
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా * ఉద్యోగులకు ఆటలతో ఉత్సాహం...ఉల్లాసం..*
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం ద ఆంధ్ర ప్రదేశ్ కో ఆఫరెటివ్ బ్యాంకు మేనేజర్ బి. నహిదా సుల్తానా, డైరెక్టర్ ఎ.బాఋరావు ఆధ్వర్యంలో ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీలు మహిళా ఉద్యోగులు,రిటైర్ అయినవారికి, కస్టమర్ లకు జరిపించారు. ఈ కార్యక్రమానికి కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్, డా.హిప్నో పద్మా కమలాకర్, అడ్వకేట్ పి.స్వరుపారాణి హాజరైనారు.మహిళలు ఈ ఆటల వల్ల పని మరింత ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. చెయగలరన్నారు. వారిపై వారికి నమ్మకం,స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశం పెరుగుతుందన్నారు. మహిళలకు చదువుకోవడం, ఉద్యోగం చేయడం ఒక ఎంపవర్ మెంట్ అన్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి, ఎంతమంది పిల్లలను కనాలనే స్వయం నిర్ణయం తీసుకోనే అవకాశం చాలా మంది మహిళలకు లేదన్నారు. ఉద్యోగం లో ప్రమోషన్, ట్రాన్సఫర్ తీసుకోవాలా లేదా అనే సందిగ్ధం లో మహిళలు కెరీర్ ను వదులుకుంటున్నార న్నారు.మరికొంత మంది పిల్లలు, భర్తలు, కుటుంబం కోసం ఉద్యోగం వదిలే స్తున్నారన్నారు.ఈ విషయం గురించి ప్రతి మహిళ ఆలోచించాలన్నారు. అలాగే వారు శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండేలా ప్రయత్నించాలన్నారు . ఉద్యోగం లో నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ విజయవంతమైన మహిళగా నిలవాలంటే ధైర్యంగా సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. నిరుత్సాహ పడకుండా తామేంటో నిరూపించుకోగలగాలని తెలిపారు.
కుటుంబ సహకారం లేకుండా మహిళలు ముందుకు పోవడం చాలా కష్టమన్నారు. పని చేసే మహిళల పిల్లలు ఎదుగుదల బాగుంటుందన్నారు. ఆటలలోనే మంచి చెడు తెలుస్తుందన్నారు. ప్రతి మహిళా జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఉంటే.. ఏ ఆపద వచ్చినా మన చేతులే చురకత్తులవుతాయన్నారు. విద్యల వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతాం.. కాబట్టి ఆ ఆపద నుంచి ఈజీగా బయటపడొచ్చు న్నారు. మహిళ తనలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి, తనను తాను ప్రేమించుకొని, తన విలువలను తాను కాపాడుకున్నప్పుడు ప్రతి రోజూ విమెన్స్ డేనే అవుతుందన్నారు. ఈ ఆటలు నిర్వహించిన బ్యాంకు యాజమాన్యానికి మహిళలు అందరూ ధన్యవాదాలు తెలిపారు. డా. హిప్నో పద్మా కమలాకర్,పి.స్వరూపా రాణి ఈ ఆటల్లో గెలుపొందినారు. గెలుపొందిన వారికి బహుమతులు, కిరిటాలను అందజేశారు. ఈకార్యక్రమం ఆద్యంతం వినోదాత్మకంగా, ఆహ్లాదంగా సాగిపోయింది. మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
డా. హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్
9390044031.









Send in watsup also.
Super . u r
మహిళా ఉద్యోగుల సమస్యలు, నిర్ణయాలు తీసుకోవడంలో వారికి ఎదురయ్యే ఇబ్బందులను చక్కగా వివరించారు. మీ మాటలు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉపయోగపడతాయి మేడమ్.. 👌👍🙏
Do come in Watsup