Failure is like a gold mine
- Mind and Personality Care

- Jun 27, 2022
- 2 min read
వైఫల్యం బంగారు గని లాంటిది*
మాట్లాడుతున్న డా.హిప్నో పద్మా కమలాకర్, డా.వి.జే.క్యార్లిన్
వైఫల్యం బంగారు గని లాంటిదని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, డా.వి.జే.క్యార్లిన్ అన్నారు. రేపుఇంటర్ ఫలితాల సందర్భంగా డా. హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో సోమవారం పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు.ఆమె మాట్లాడుతూ నేడు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ యువత, పరీక్షల వైఫల్యం తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. నా దృష్టిలో చదవడం అంటే ఒక స్నేహితుడితో సమయాన్ని గడపడం లాంటి దన్నారు.
గెలుపు నేర్పలేని ఎన్నో -పాఠాలు ఓటమి నేర్పుతుందని చెప్పారు. ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలన్నారు. వైఫల్యం చెందినా విద్యార్థులు ఆగి పోకుండా ముందుకు నడుస్తూ,‘మరికొంత ప్రయత్నం చెయ్యాలని తెలిపారు. గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా గమ్యం చేరడమే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు ఎన్ని సమస్యలు వచ్చినా ఆగిపోకూడదన్నారు. అంతిమ లక్ష్యంగా చేసుకుని యత్నం కొనసాగించాలన్నారు.
‘ప్రతివారూ ఒక గమ్యాన్ని నిర్దేశించుకోని దాన్ని చేరడానికి తగిన ప్రణాళిక రచించుకోవాలన్నారు. మధ్యలో ఏర్పడే చిన్నచిన్న ఆటంకాలకు బెదిరిపోకుండా, వచ్చే చిన్నచిన్న ఫలితాలకు పొంగిపోకుండా సమస్థితిలో ఉండాలని తెలిపారు. ‘సాగితేనే ప్రగతి- ఆగితే అధోగతి’! అని చెప్పారు. ఎన్ని వైఫల్యాలు వచ్చినా ఏవైనా సరే, ఎక్కడా ఆగిపోవద్దు. గమ్యం చేరే వరకు సాగిపోతూనే ఉండాలన్నారు.
తల్లి తండ్రులు పిల్లలు వైఫల్యం చెందితే ముందు దండీచడం మానేసి ఆ తప్పు ఎందుకు జరిగింది, దానివల్ల వచ్చే పరిణామాలు చెబితే మరొక్కసారి అది చేయకుండా ఉండే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయన్నారు. చదువు - మార్కులు - వంటివి మాత్రమే జీవితం కాదని, సంగీతం, పుస్తకాలు, మాట్లాడటం, రాయడం వంటి సవాలక్ష అవకాశాలు ఉన్నాయని తెలిసే మార్గాలు చూపించడం మంచిదని చెప్పారు. ఎక్కువ మందితో మాట్లాడి, ఎక్కువ మందిని కలిసి, ఎక్కువ ఊళ్ళు, భాషలు, పుస్తకాలు విషయాలు తెలిసే కొద్ది కొత్త వాటి మీద ఆసక్తి, వాళ్ళు సాధించిన విజయాలు , వాటినుండి ప్రేరణ, మీరు కూడా చేయగలరు అనే నమ్మకం పెరిగి మరొక మంచి దారిలో ప్రయత్నం చేస్తారన్నారు. విద్యార్థులు ఇష్టం అయిన విషయాలు సేకరించి నచ్చేటట్లు ప్రవర్తించి లైన్ లో పెట్టగలరు. ఫ్రెండ్ బర్త్డే కి కష్టపడి సర్ప్రైస్ ఇవ్వగలరు. ఇవన్నీ చేసేవారు ఇదే ఫార్ములా ని వాళ్ళ కెరీర్ లో పదవ శాతం పెట్టినా చాలన్నారు. పైవి ఏవి మానేయక్కరలేదు. రెండు గంటలు ఇంటర్నెట్ బ్రోస్ చేసి ప్రతి రోజూ ఒక గంట పుస్తకం చదివితే చాలు ఏ పరీక్షలైనా విజయం సాధించగలరన్నారు.
వారు రోజులపాటు విద్యార్థులకు ఆన్లైన్ ఉచిత కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.వివరాలకు 9390044031/40 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్
9390044031






You are absolutely correct. This article is very usefull in this time