HUMAN - MIND - PROBLEMS
- Mind and Personality Care

- Apr 29, 2022
- 1 min read
మనిషి - మనసు - సమస్యలు
* మనిషి జీవితం లో ఏదో సాధించాలని చేస్తున్నా పరిశోధన లో మనిషిని మనిషిగా చూడటంలేదు.*
* మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు.
* జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు...
నీకు ఎప్పుడైన *కోపం* వచ్చినప్పుడు *మనసుతో* పోరాడు *మనిషితో* కాదు *సమస్య* వచ్చినప్పుడు *కాలంతో* పోరాడు *కన్నీటితో* కాదు *నిజానికి అబద్దానికి* తేడా ఏమిటో తెలుసా ? నువ్వు చెప్పిన *అబద్దాన్ని* నువ్వే *రక్షిస్తూ* ఉండాలి కాని ! *నిజం* మాత్రం నిన్ను *రక్షిస్తూనే* ఉంటుంది ఏప్పటికైనా , మీ *మనసు* బాగో లేనప్పుడు *మాటల* జోలికి పోవద్దు ఎందుకంటే మీ *మనసుని* సరిచేసుకునేందుకు అనేక *మార్గాలున్నాయి* కానీ *మాటల్ని* వెనక్కు తీసుకు నేందుకు ఒక్క *మార్గమూ లేదు* .
మనుషులలో *మార్పు* అనేది చాలా *సహజం*
ఎలా మారాలి అన్నది *వివేకం* చెబుతుంది
ఎప్పుడు మారాలి అన్నది *అనుభవం* చెబుతుంది అసలు ఎందుకు మారాలి అన్నది *అవసరం* చెబుతుంది
*మేఘం* బరువు మోయలేనప్పుడు *వర్షం* కురుస్తుంది *మనసు* బాధను మోయలేనప్పుడు *కన్నీరు* బయటకు వస్తుంది.
*జీవితంలో* నచ్చని *క్షణాలు* చాలా వస్తాయి *మోసపోయామనో కోల్పోయామనో* మద్యలో *వదిలేయరాదు*
*తోటి ప్రయానికుడు నచ్చకపోతే *రైలు* నుoడి దూకేస్తామా ?
*గొడుగు రంగు* నచ్చకపోతే *వర్షంలో* తడుస్తూ వెళ్తామా ? ఏదైనా సరే *గమ్యం* చేరుకోవాలి. మన ప్రయాణమే కదా..
మన *కథ మద్యలో* వచ్చేవి ప్రకటనలు మాత్రమే
*కావాలన్నా తిరిగిరానిది *గతం*
*వద్దనుకున్నా వచ్చేది *మరణం*
* ఎంత ఉన్నా చాలనిది *ధనం* * మన దగ్గర డబ్బులేకుంటే మన రక్తసంబంధంలోనే విలువుండదు, _అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది.
* ఖర్చు పెట్టినా కొనలేనిది *వయస్సు*
*గెలిచినపుడు పొగడడానికి *వంద మంది* ఉన్నా లేకపోయినా ఓడినపుడు ఓదార్చడానికి *ఒక్కరైనా* ఉండాలి.
*ఖాళీ చేతులతో తల్లి గర్భంనుండి వచ్చాము, ఖాళీ చేతులతో భూగర్భంలోకి పోతాం, తొలిస్నానం గుర్తులేదు, చివరిస్నానం తెలియదు.
*ఇదే మనిషి జీవితం.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్
@9390044031



Super ga chepparu about human mind, controlling our mind.