Hypno Kamalkar is the person who breathed life into the field of psychology
- Mind and Personality Care

- Dec 13, 2022
- 2 min read
సైకాలజీ రంగానికి ఊపిరి పోసిన వ్యక్తి
హిప్నో కమలాకర్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ జాతీయ అధ్యక్షులు డా.జి.సమరం
సైకాలజీ రంగానికి ఊపిరి పోసి ఓ ధైర్యం...ఓ భరోసాని హిప్నో కమలాకర్ ఇచ్చారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ జాతీయ అధ్యక్షులు డా. జి. సమరం అన్నారు. మానసిక సమస్యలు ఇలా ఉంటాయని ఆయన తెలియజేశారని తెలిపారు.ఈరోజు ఆయన లేకపోవడం సమాజానికి చాలా నష్ట మని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ - ఇండియా, ఆధ్వర్యంలో ఒక రోజు జాతీయ స్థాయి శిక్షణా శిబిరం నిర్వహించారు. శని వారం విజయవాడ ఐకాన్ పబ్లిక్ స్కూల్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ జాతీయ అధ్యక్షులు డా. జి. సమరం గారు లైంగిక విజ్ఞానం పై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ బాల్యాన్ని, జీవితాన్ని చిదిమేస్తున్న ముఠాల దాష్టీకం సమాజానికి పెనుసవాలుగా మారుతోందన్నారు. ఆనందం, సంతోషాన్ని కలిగించటమే కాదు.. ఆరోగ్యం, సంబంధాల మీదా శృంగారం గణనీయమైన ప్రభావం చూపిస్తుందని చెప్పారు. శృంగార లేమితో రక్తపోటు, నిద్రలేమి, మతిమరుపూ వంటి మానసిక సమస్యలు వస్తాయన్నారు. మహిళలో రక్తహీనతతో లైంగికంగా ఆసక్తి ఉండదన్నారు. అనైతిక సంబంధాలతో అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. పిల్లలకు తల్లి దండ్రులు టీనేజ్ వయసులో ఏర్పడే సెక్స్, సెక్సువాలిటి ప్రభావాలను వివరించాలన్నారు. టీనేజ్ లో ఏది ప్రేమ, ఆకర్షణ,తెలియక జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. యువత మనోభావాలు దెబ్బతినకుండా ఎలా ఉండాలో వివరించారు.
ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ - ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ దేశ భవితకు పునాది కావాల్సిన విద్యాలయాలు- వికృత వేధింపులకు వేదికలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేదింపులు,ర్యాగింగ్ పర్యవసానాలపై
కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్త్రీలు, బాలికలపై లైంగిక పరమైన హింసను నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందన్నారు. చదువుల ప్రక్షాళన
సాధ్యపడితేనే- బాలికల నిండు జీవితాలను బలితీసుకొంటున్న ఈ జాడ్యాన్ని రూపుమాపగలమని తెలిపారు. ప్రతీ కళాశాలలో సైకాలజిస్ట్ లను నియమించాలని డిమాండ్ చేశారు. నిరక్షరాస్యత, కుటుంబ పరిస్థితులు, ప్రేమ, పెళ్ళి, ఉపాధి వంటివి స్త్రీల సమస్యల్ని పెంచుతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాలు, పోర్నోగ్రఫీ, మద్యపానం,
మాదకద్రవ్యాలు, పేదరికం, ఆడపిల్లల నిస్సహాయత వంటివీ వారిపై హింసను ప్రేరేపిస్తున్నాయని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా చోటుచేసుకున్న పరిణామాలు, జీవనశైలిలో మార్పులు సైతం స్త్రీల భద్రతపై కొంత ప్రభావం చూపుతున్నాయన్నారు.
అందుకే స్త్రీల రక్షణ, స్వేచ్ఛ, సమానత్వం ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఐకాన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డా.జి.వీరభద్రం, డా.వి.జనార్థనం, డా.పి.రమేష్ కుమార్, డా.ఇ.షహినా, డా.పి.లలితాదేవి, పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో సైకాలజిస్టులు డా. కె. చిన్నవాడు శ్రీకాకుళం, ఎల్. పూర్ణ కుమార్ గన్నవరం, బి.ఎం. దీక్షిత్ హైదరాబాద్, వై. సురేష్ బాబు అనంతపురం, ఎం.ఎస్. శ్రీనివాస్ కాకినాడ, డా. వి. జనార్దనం కాకినాడ, పి. లలిత దేవి అమలాపురం, డా. పి. రమేష్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా, యస్. శ్రీనివాస రావు రాజముండ్రి, ఎం. వాసుదేవరావు విజయనగరం, సైకాలజీ విద్యార్థులతో బాటు టీచర్లు, లెక్చరర్లు, లాయర్లు, సామాజిక సేవా కార్యకర్తలు, భార్యా భర్తలు, యువత పాల్గొన్నారు. సైకాలజిస్ట్ లకు సర్టిఫికేట్లు అందజేశారు. లైంగిక విజ్ఞానం పై అవగాహన కల్పించిన డా.జి.సమరంను సైకాలజిస్ట్ లందరూ ఘనంగా సత్కరించారు.
. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ - ఇండియా, డా హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్,* *అశోక్ నగర్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్.*
సెల్ @ 9390044031













Comments