International Women's Day , March '8'-2022 Traditional games competitions
- Mind and Personality Care

- Feb 26, 2022
- 2 min read
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా (మార్చి 8)
*సాంప్రదాయ ఆటలపోటీలు*
కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్ డా.హిప్నో పద్మా కమలాకర్
సాంప్రదాయ ఆటలు ఆరోగ్యానికి బాటలుగా ఉండేవని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్, డా. క్యార్లిన్, డా.పి.స్వరూప రాణి, గైనకాలజిస్ట్ డా.నాగేశ్వరి, పి.ఒఋల్ రెడ్డి స్కూల్ పిటి టిచర్ అన్నపూర్ణ, యోగా గురు బి.సరోజని తెలిపారు. శనివారం ఉదయం డా.హిప్నోకమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ హాల్లో పత్రికా విలేఖరులు సమావేశం నిర్వహించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి '8' సందర్భంగా ఈ పోటీలు డా.హిప్నోకమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆధ్వర్యంలో స్కూల్స్, కాలేజీలలో జరుగుతాయన్నారు.
ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానోత్సవం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అందజేస్తారని తెలిపారు.
ఈ ఆటలలో పాల్గొనేవారు 9390044031 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుకోవచ్చన్నారు. అలనాటి ఆటలు శారీరిక దారుఢ్యం, మానిసిక ధైర్యం పెంచుతూ పిల్లలకు తోడ్పడేవన్నారు.. పిల్లలతో పాటు పెద్దవాళ్లను ఎంతగానో కట్టిపేడేసేవన్నారు. అంతేగాక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచేవని చెప్పారు.. గోలీలాట, బిల్లంగోడు(కర్రబిళ్ల), ఒంగుళ్లు దూకుళ్లు, అచ్చంగిల్లాలు, ఏడు పెంకులాట, పిచ్చి బంతి, బొంగరాల ఆట, కోతి కొమ్మచ్చి, చెమ్మచెక్క, కబడ్డీ, చెడుగుడు, దాగుడు మూతల దండాకోర్, ఒప్పుల కుప్ప, వైకుంఠ పాళీ, గవ్వలాట,అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఆటలు, బాల బాలికల చేత ఆడించేవారని, దీనికోసం ప్రత్యేకంగా ఒక ‘డ్రిల్‌టీచర్’ ఉండేవారన్నారు. అయితే ప్రస్తుత తరానికి కనీసం వీటి పేర్లు కూడా తెలియని పరిస్థితిని ఆవేదన వ్యక్తంచేశారు. నేటితరం పిల్లలకు కేవలం స్మార్ట్‌ఫోన్లలో వీడియో గేములే దిక్కు. వీటి ద్వారా ఏ మాత్రం శారీరక వ్యాయామం లేకపోగా కొన్ని వీడియో గేములు పిల్లలపై విపరీతమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని, మరికొందరు పిల్లల్లో ఊబకాయానికి, చిన్నవయసులోనే చూపుమందగించి కళ్లజోడు రావటానికి ఈ వీడియో గేములే కారణమవుతున్నాయని తెలిపారు. అందుకే అలనాటి ఆ ఆరోగ్యకరమైన ఆటలేమిటో నేటి తరం పిల్లలకు పరిచయం చేయడం కోసం ఒక చిరు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ఆటలలో ఒకవైపు ఎంత అలసట వచ్చినా సరే పట్టుదలతో విక్రమార్కుడిలా ప్రయత్నించేవారన్నారు. వైకుంఠ పాళీ ఆట ఆడుతుంటే ఉత్సాహంగా నిజ జీవితంలోని ఒడిదుడుకులు కనిపిస్తాయన్నారు. నిచ్చెన ఎక్కితే మంచి కర్మలు చేసినట్టు, పాము నోట్లో పడితే పాపాలు పడినట్టు రూపొందించారన్నారు. గుజ్జన గూళ్లు, వామనగుంటలు, నేలా బండా, తొక్కుడు బిళ్లా, సిరిపట్టె, ఖోఖో, బొంగరాల ఆట, బచ్చాలాట అబ్బో ఆ రోజుల్లో ఎన్ని ఆటలో. తోటిపిల్లలతోనే కాదు వీరివీరి గుమ్మడిపండు వీరిపేరేంటి అని అంటూ అమ్మ, అమ్మమ్మ, అక్క, చెల్లాయి వంటి వారితో ఆడే ఆటల్లో కుటుంబసభ్యుల ఆప్యాయత లభించేదన్నారు. ఈ ఆటలు అన్నీ శరీరానికి ఆరోగ్యాన్నిచ్చేవేనని, అంతేకాదు సాయంత్రవేళల్లో ఇలా ఆటలాడి వచ్చిన పిల్లలు అలసిపోయి ఎంతో హాయిగా నిద్రపోయేవారని తెలిపారు. దీంతో వారికి ఎంతో మానసిక వికాసం కూడా ఉండేదన్నారు. ఈరోజుల్లో మొబైల్, ట్యాబ్‌ల ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా దానిలోని రేడియేషన్ ప్రభావంతో ఎదుగుదల సరిగా లేకపోవటం, వీటి మోజులో పడి అర్ధరాత్రి వరకు మేల్కొని నిద్రకు దూరమవటంతో ఎన్నో రకాల శారీరక, మానసిక సమస్యలకు లోనవుతున్నారన్నారు. కనుక ఇకనైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అలనాటి ఆటల్లో కొన్నైనా నేర్పించి వారు శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండేలా ప్రయత్నించాలన్నారు.ఆటలలోనే మంచి చెడు నేర్చుకోవాలి అని మనం చెప్పకనే తెలుస్తుందన్నారు. చెడు మార్గన్ని ఎంచుకునే వారు అధం పాతాళానికి, మంచి గుణాలు అలవర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతాము అని ఈ ఆటలో చెప్పడం జరిగిందన్నారు.
డా. హిప్నో పద్మా కమలాకర్, కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్
9390044031.












Comments