Love, Threats, and Suicides: A Psychological Analysis
- Mind and Personality Care

- Jan 7
- 2 min read
ప్రేమ, బెదిరింపులు, ఆత్మహత్యలు: సైకలాజికల్ విశ్లేషణ
ప్రేమ వ్యవహారాలు వ్యక్తిగత జీవితంలో భావోద్వేగాలు, ఆనందం, బాధలను కలిగించే అంశాలు. అయితే, ఈ సంబంధాలలో చోటుచేసుకునే ఒత్తిడి, బెదిరింపులు, సామాజిక ఒత్తిళ్ల వల్ల కొందరు యువత ఆత్మహత్య వంటి దారుణ నిర్ణయాలకు చేరుతారు. ఈ అంశాన్ని సైకలాజికల్ దృక్కోణంలో విశ్లేషించడం సమాజానికి కీలక సందేశాలను అందించడం...
1. భావోద్వేగాలు, ఒత్తిడి
ప్రేమలో ఉన్న వ్యక్తులు గాఢమైన భావోద్వేగాలకు లోనవుతారు. తగిన మద్దతు లేకపోవడం, బెదిరింపులు, ఒత్తిడితో బాధితులు తీవ్రంగా ప్రభావితమవుతారు. ప్రేమలోని సమస్యలతో పాటు, బెదిరింపుల వల్ల వచ్చే భయం, ఆందోళన, ఆత్మన్యూనత భావాలు వారి మానసిక స్థితిని పూర్తిగా దెబ్బతీస్తాయి.
2. అపరిపక్వత (ఇమేచ్యురిటీ)
యువత లేదా మైనర్లు ప్రేమలో పడి దీర్ఘకాలిక పరిణామాలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు. వయస్సుతో పాటు మెదడు వికాసం పూర్తిగా జరగకపోవడం వల్ల వారు తక్షణ ఫలితాల మీదే ఎక్కువ దృష్టి పెడతారు. ప్రేమలోని విఫలతలను తట్టుకోవడంలో తగిన పరిణతి లేమి కారణంగా ఆత్మహత్యాత్మక ఆలోచనలు మరింత పెరుగుతాయి.
3. సామాజిక ఒత్తిడి
మన సమాజంలో ప్రేమ వ్యవహారాలను ప్రతిఘటించే కుటుంబాలు, సమాజం బాధితుల మీద మరింత ఒత్తిడిని కలిగిస్తాయి. సమస్యలను వాస్తవికంగా అర్థం చేసుకునే మార్గదర్శకులు లేకపోవడం వల్ల వారు ఒంటరితనానికి గురవుతారు. ఈ ఒత్తిడి అనేక సందర్భాల్లో ఆత్మహత్యలకు దారితీస్తోంది.
4. ఆత్మహత్యాత్మక ఆలోచనలు
బెదిరింపులు, ఒత్తిడిని ఎదుర్కోవడం కష్టంగా భావించి, సమస్యల పరిష్కారం కనిపించక బాధితులు ఆత్మహత్యను ఒక తుది నిర్ణయంగా చూస్తారు. తమ భావోద్వేగాలను ఎవరితోనైనా పంచుకోవడం లోపించడం కూడా వారి పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.
5. తల్లిదండ్రుల పాత్ర
తల్లిదండ్రులు పిల్లల జీవితాలను సమర్థంగా గమనించి, వారికి స్నేహపూర్వకంగా మార్గదర్శనం చేయాలి. ప్రేమ, వ్యక్తిత్వ అభివృద్ధి, జీవిత విలువలపై వారికి అవగాహన కలిగించాలి.
6. సమాజానికి సందేశం
మానసిక ఆరోగ్యం:
ఒత్తిడి, బెదిరింపులు, ప్రేమలో సమస్యల విషయంలో కౌన్సెలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండాలి.
అవగాహన:
ప్రేమ, సంబంధాల విషయంలో సమాజంలో సానుకూల అవగాహన పెంపొందించాలి.
ప్రభుత్వం పాత్ర:
మైనర్లు, యువత కోసం మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి.
7. తగిన మద్దతు, నివారణ
బాధితులు కుటుంబ సభ్యులతో తమ సమస్యలను పంచుకోగలగాలి. స్నేహితులు, ఉపాధ్యాయులు, నిపుణుల మద్దతు ద్వారా వారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
ఈ సంఘటనలు ప్రేమలో ఉన్న వ్యక్తుల మానసిక స్థితిపై సమాజం లోని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. బెదిరింపులే కాదు, భావోద్వేగాలను అర్థం చేసుకోకపోవడమే ఆత్మహత్యలకు ప్రధాన కారణం. అందరూ కలిసికట్టుగా భావోద్వేగ మద్దతును, సైకలాజికల్ అవగాహనను పెంచితే, ఈ తరహా ఘటనలను నివారించవచ్చు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీ
@ 9390044031



Comments