Mind is the source of success.
- Mind and Personality Care

- Oct 13, 2022
- 4 min read
విజయానికి మనసే మూలం
సమస్యలొస్తే రానీ, సవాళ్లు ఎదురైతేఎదురవనీ, ఓటమి తలుపుతడితేతట్టనీ, నిలుద్దాం, పోరాడదాం,గెలుద్దాం- అనుకోగలిగితే మానసిక సమస్యలకి చోటుంటుందా, విజయాలకులోటుంటుందా! చాపకింద నీరులావిస్తరిస్తున్న 'మానసిక సమస్యలని నిలువరించడానికి మనసే ఆయుధం.సంకల్పమే ధైర్యం.
విజయానికి మూలం మనసు. మనసు 'గతి' ఇంతేనని వాపోయిన మహాకవి మనసులేని బతుకొక నరకం అనికూడా అన్నాడు. శరీరం మనసు వేర్వేరు.కావు. శరీరానికి జబ్బు వచ్చినట్లే మనసుకు కూడా వస్తాయి. శరీరానికి వచ్చే వ్యాధులకు మందులెంత అవసరమో," మనసుకు కలిగే వ్యాధులకు బాధలకు వైద్యం కూడా అంతే అవసరం. గతులు తప్పే మనసును గ్రహించి, అంతరంగ శృతులను సరిచేసుకోవాలంటే భావోద్వేగాలకు ఆలవాలమైన మానసిక స్వభావ స్వరూపాలను 'అర్ధం చేసుకోవాలి.
మనసు అనగానే మనసుకవి ఆత్రేయ గుర్తుకు రాకమానడు. "మనసు"మీద ఆయన రాసినన్ని పాటలు ఇంకెవ్వరూ రాసి వుండరు. మనసు అది చేసేగారడీలకు అంతేలేదు. ఒక విధంగా మనిషి మనసు చేతిలో కీలుబొమ్మ. సమస్తజీవులన్నిటినీ చెలాయించగలిగే మనిషి “మనసు" చేతిలో వశమైపోవటం కాస్తవిచిత్రంగానే వుంటుంది. అయినా ఇది కఠినమైన వాస్తవం. మనిషి బుద్ధిజీవి. ఏజీవరాశికీ లేని మహా మేధాశక్తి మనిషి సొత్తు. అన్ని రకాల సమస్యా పరిష్కారశక్తిమనిషికి వుంది. ఈ పరిష్కారశక్తి జన్యువుల ద్వారా, అనువంశికంగా మానవునికిసంప్రాప్తిస్తుందని జన్యుశాస్త్ర నిపుణులు అంటున్నారు. అటువంటి మేధా సంపత్తివున్న మనిషి శరీరంలో రెండు పరిపూర్ణమైన వ్యవస్థలు వున్నట్లుగా మనం స్పష్టంగాచూస్తున్నాం. అవి మన శరీరం, మన మనసు. మన మెదడు మానసిక వ్యవస్థకుకేంద్రం. విచిత్రమేమంటే “మన”లో తొంభై ఎనిమిది శాతం పరిమాణంలో వున్న మన శరీరాన్ని కేవలం "2" శాతం మాత్రమే వున్న మెదడు శాసిస్తుంది. మనిషిశరీరం-మనసు పరస్పర సహకారంతో ఉంటాయి కాబట్టి మానవశక్తి సద్వినియోగపడుతూ వుంటుంది. ఈ మనసు.... ఎక్కడుంది..? దీని స్వరూపం ఏమిటి..? మెదడు కన్పించినట్లుగా మనకు ఈ మనసు కన్పించదు. కానీ మెదడులోనే మనసు వుందని ఫ్రాయిడ్ అంటూండేవాడు. ఫ్రాయిడ్ ఆలోచన ప్రకారం బ్రెయిన్లోనే మైండ్ వుంటుంది. బ్రెయిన్ కేవలం కండరాల వంటి, పదార్ధం కాదని, అందులో నాడీ కణాలతో బాటూ ఆలోచనా స్రవంతులు వుంటాయని అంటూ వుండేవాడు. అంచేత బ్రెయిన్లోనే మన మనసు దాగి వుంటుందని ఫ్రాయిడ్ అనేవాడు. మనసొక భావాల పరంపర, సంకల్పం ఆలోచనలు మనసు గుర్తింపుకు ఆధారాలు. ఇది ఒక రూపం అంటూ లేని ఒక అజ్ఞాత శక్తి.ఒకలా జీవించాలనుకుంటాం. మరోలా బతుకుతాం. ఊహలకూ వాస్తవాలకూ మధ్య దూరం పెరిగేకొద్దీ జీవితం పట్ల మమకారం తగ్గుతుంది. నిరాశ అధికం అవుతుంది. నిస్పృహఆవరిస్తుంది. ఆ విపరిణామాలు ఎలా అయినా ఉండవచ్చు మనోవైకల్యానికి కారణం కావచ్చు, ఆత్మహత్యలకు దారితీయవచ్చు. హత్యలకు ఉసిగొల్పవచ్చు. విడాకులు దాకా వెళ్లవచ్చు. ఉద్యోగాన్ని కోల్పోవాల్సి రావచ్చు, వ్యాపారంలో దివాలా తీయొచ్చు, వృత్తి జీవితం అగాథంలో కూరుకుపోవచ్చు.
*మానసిక అనారోగ్యం అంతర్జాతీయ సమస్య.* భారత్ లో ఆ తీవ్రత మరీ అధికం. అందుకు అనేక కారణాలు. ఇక్కడ, మానసిక రుగ్మతల గురించి సామాన్యులకే కాదు, ఓమోస్తరు వైద్యులకు అవగాహనలేదు. సామాజిక పరిస్థితులు కూడా ఏమంత ఆశాజనకంగా ఉండవు. నిరుద్యోగం, పేదరికం, స్వార్ధ రాజకీయాలు, హింసాత్మక సంఘటనలు - నిత్యం ఏదో ఓ సమస్య! అక్షరాస్యతా తక్కువే. విద్యావంతులతో పోలిస్తే, నిరక్షరాస్యులు మానసిక సమస్యల బారినపడటానికి పద్నాలుగు రెట్లు అవకాశం ఎక్కువ. కాబట్టే, ప్రపంచ వ్యాప్తంగా 32 శాతం ఆత్మహత్యలు మనదగ్గరే నమోదవుతున్నాయి. అందులోనూ... తొంభైశాతం ఆత్మహత్యలకు మానసిక సమస్యలేప్రధాన కారణం కావచ్చు. దాదాపు36 శాతం భారతీయులు ఏదో ఓ సందర్భంగా మానసిక సమస్యలకి లోనవుతున్నారు. నాటికి ఆ మనోవ్యాధి మనుషులు ప్రాణాల్ని తోడేయడంలో... క్యాన్సర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమి స్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. ఎవర్నీ వదిలిపెట్టడంలేదా రాకాసి సమస్య. కల్లాకపటం ఎరుగని చిన్నారులు కూడా కుంగుబాటుతో కునారిల్లుతున్నారు. కడుపునొప్పునో, తలనొప్పనో తరచూ బడికి డుమ్మాకొట్టే పిల్లల్లో ఒత్తిడి ని గుర్తించారు నిపుణులు. ఇదేం యాదృచ్ఛికమైన పరిణామం కాదు. బలమైన మూలాలే ఉన్నాయి.
పిల్లల విషయంలో కన్నవారి అంచనాలు పెరిగిపోతున్నాయి. తమ కొడుకో కూతురో చదువుతున్న బళ్లో మరొకరు మొదటి స్థానంలో ఉండకూడదని ఆశిస్తున్నారు. ఆమేరకు బిడ్డల్ని శాసిస్తున్నారు. పిల్లల పరిమితుల్నీ పరిజ్ఞానాన్ని అభిరుచుల్ని ఆసక్తుల్ని అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదు. పెద్దల అంచనాల్ని నిజం చేసేప్రయత్నంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అది కాస్తా డిప్రెషన్ గా మారుతోంది. సోషల్ నెట్వర్కింగ్ , వ్యసనాలూ అతి తిండీ అతి నిద్రా, సెల్ ఫోన్ ఎడిక్ట్, కౌమారాన్నీ కుదేలు చేస్తోంది.టీనేజీ పిల్లల్లో.. ఇతరులతో పోల్చుకుని కుమిలిపోవడం, తమనెవరూ ప్రేమించడంలేదని బెంగపడిపోవడం, తమ సమస్యకు చావే పరిష్కారమని భ్రమపడటం,కోపతాపాలతో ఒంటికి గాయాలు చేసుకోవడం, ప్రతి చిన్న విషయానికీ అబద్ధాలాడటం, వ్యసనాల బారిన చిక్కుకోవడంతదితర లక్షణాలు మానసిక సమస్యలే.కెరీర్ అనేది నైపుణ్యం చుట్టో అభిరుచులచుట్టో తిరగాలి. దురదృష్టవశాత్తూ, విజయానికి జీతమే కొలమానం అవుతోంది. ఎంతసంపాదిస్తే అంత ఎదిగినట్టు. ఆ ప్రయతంలో శక్తికి మించిన భారాన్ని భుజానికెత్తుకుంటున్నాడు ఉద్యోగి.ఆరోగ్యాన్నీ వ్యక్తిగత జీవితాన్నీ కెరీర్ ని పణంగా పెడుతున్నారు.జీవిత భాగస్వామితో, పిల్లలతోసంబంధాలూ అంతంతమాత్రమే. కృత్రిమత్వం డిప్రెషన్ సహా అనేకమైనవి మానసిక సమస్యలకు కారణం అవుతోన్నాయి.బతుకు పోరాటంలో అలసి సొలసిన వయోధికుల్నీ ఈ మహమ్మారి వదలడం లేదు. ప్రేమరాహిత్యం, భవిష్యత్తు పట్ల అనిశ్చితి, దీర్ఘకాలిక ఒంటరితనం, గృహహింస, చిట్ఫండ్ కంపెనీలూ వగైరా ఆర్థిక సంస్థల మోసాలూ... మానసిక సమస్యలకి ప్రధాన కారణాలు.పురుషుడితో పోలిస్తే, మహిళల్లోనే డిప్రెషన్ రెట్టింపు ఆస్కారాలు. ఆమె ప్రపంచంచిన్నది. భర్త, పిల్లలు, అత్తమామలు, పుట్టింటివారు - అంతే! ఏ బాధవచ్చినా మౌనంగా భరించాల్సిందే, ఎంత పెద్ద కష్టమొచ్చినా మనసులోనే కుమిలిపోవాల్సిందే.ఆ ఏకాకితనమే మానసిక సమస్యలకి స్వాగతద్వారాలు. కోరికోరి తెచ్చుకునేవే మానసిక సమస్యలు. నూటికి తొంభైశాతం అది స్వయంకృతమే! సమస్యకు మనమే కారణంఅయినప్పుడు పరిష్కారం కూడా మనదగ్గరేఉండితీరుతుంది. 'మనసు దుర్బలంగా ఉన్నప్పుడు... అనేకానేక నెగెటివ్ ఆలోచనలు చుట్టుముడతాయి. ఒక ఆలోచనలోంచి మరో ఆలోచన, మరో ఆలోచనలోంచి ఇంకొన్ని ఆలోచనలు... వాటి నిండా అర్థంలేనిభయాలూ, తలాతోకా లేని ఊహలే. బుర్ర కందిరీగ తుట్టెలా తయారైపోతుంది. పరిస్థితి ఇంకాస్త దిగజారుతుంది. 'సెల్ఫ్ కౌన్సెలింగ్'ద్వారా ఆ ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్టవేయవచ్చు. 'నా మీద నాకు నియంత్రణఉంది. నా ఆలోచనలు నా అధీనంలోనేఉన్నాయి. ఓటమిని ఎదిరిస్తాను. కష్టాల్నిభరిస్తాను. అంతిమంగా నేను గెలుస్తాను'...తరహా స్వయం సందేశాలు మనసు మీదబలమైన ప్రభావాన్ని చూపుతాయి. ధ్యానం కూడా ఓరకమైన సెల్ఫ్ కౌన్సెలింగే! ఆ మౌనంలో మనతో మనం నిశ్శబ్దంగా సంభాషించుకుంటాం. మన చుట్టూ గింగిర్లు కొడుతున్న ఆలోచనల్లో వేటిని భద్రపరుచు కోవాలో మనమే నిర్ణయించుకోవాలి. మనసు విప్పి పంచుకోవాలి:కొన్ని రుగ్మతలు పంచుకోకపోతే పెరిగిపోతాయి. మానసిక సమస్యలు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు 'టాక్ థెరపీ' సమర్థంగా పనిచేస్తుంది. బాధితుడికి తన మనసులోని భావాల్ని ఆలోచనల్నీ బాధల్నీ వైఫల్యాల్నీ పంచుకోడానికి ఓ తోడంటూ దొరికితే... బుర్రలోని చెత్తంతా వదిలిపోతుంది. మనసు తేలికపడుతుంది. నిజమే, చాలా సందర్భాల్లో ఆకాస్త ఆసరా కూడా లభించదు. ఎవరి పరుగు వారిదైన ప్రపంచంలో, ఎవరి బతుకు వారికి బరువైన సమాజంలో, కాలాన్ని కరెన్సీలోకి మార్చుకుని లెక్కలేసుకునే ఆర్థికయుగంలో ఎవరు మాత్రం... ఓపిగ్గా చెవి ఒగ్గుతారు. ఆలోటును జీవిత భాగస్వామో, ఆత్మీయనేస్తమో భర్తీచేయాలి. చాలా సందర్భాల్లో అవి....సహజ లక్షణాల్లా కనిపించవచ్చు. కాలంతోపాటూ అతన్లోనో ఆమెలోనో వచ్చినమార్పుల్లా అనిపించవచ్చు. ఏది ఏమిటోఅతి దగ్గర నుంచి చూసినవారికే అర్థమౌతుంది. కుమిలిపోతున్న వ్యక్తి కోసం రోజూ ఎంతోకొంత నాణ్యమైన సమయాన్ని కేటాయించాలి. ఓదార్పు పేరుతోఉపన్యాసాలు ఇవ్వకుండా, అవతలి మనిషికి మనసు విప్పే అవకాశం కల్పించాలి. భయాల్ని చెప్పుకోనివ్వాలి, బాధల్ని పంచుకోనివ్వాలి, అసూయాద్వేషాల్ని కక్కేసుకోనివ్వాలి, కన్నీళ్లను ప్రవహించనివ్వాలి.కొత్త పుస్తకాల్నీ,కొత్త ప్రాంతాల్నీ పరిచయం చేయాలి, కొత్త అభిరుచుల్ని ప్రోత్సహించాలి. కలలు కల్లలైనప్పుడూ, లక్ష్యాలు అందనప్పుడూ, వైఫల్యాలు వెక్కిరించినప్పుడూదిగాలుపడిపోతాడు. కాకపోతే, శాశ్వతంగాఆ కూపంలోనే కూరుకుపోకూడదు. బయటపడే ప్రయత్నం ప్రారంభించాలి. గుండె దిటవు చేసుకుని వర్తమానంలోకి రావాలి. లోపాల్ని సరిచేసుకుని ముందు కెళ్లాలి. మనసులో పేరుకు పోయిన నెగెటివ్ ఎనర్జీని పాజిటివ్ శక్తిగా మార్చుకోవాలి.మనసును స్థిరంగా ఉంచుకో.సుఖాలు రానీ దుఃఖాలు రానీ, లాభాలురానీ నష్టాలు రానీ, జయాలు రానీ అపజయాలు రానీ... సుదృఢమైన మనోస్థితిలోనే జీవన పోరాటాన్ని కొనసాగించు.*కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడుఅర్జునుడికి చెప్పిందే, కౌన్సెలింగ్ *వ్యాయామం:నడక, యోగా, తాడు ఆట, వైకుంఠ పాళీ, సుడోకు, పజిల్స్, పిల్లలతో ఆడుకోవడం.మనసుకు ఆహ్లాదాన్ని, శక్తి ఇస్తాయి.వ్యాయామం చేసే వారితో పోలిస్తే, చేరనివారే మానసిక సమస్యలకి లోనవుతున్నారు. రోజూ 30 నిమిషాల నడక ,యోగా ద్వారా మానసిక సమస్యలను వదిలించుకోవచ్చు.
ఆహారం:పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు నిత్య భోజనంలో భాగం చేసుకోవాలి. పోషక విలువలతో కూడిన భోజనం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.
కౌన్సెలింగ్ : మానసిక సమస్యలకి మందు లేని మాయరోగం కాదు. తొంభై శాతం కేసుల్లో కౌన్సెలింగ్ తో స్వస్థత సాధ్యమే. సమస్య ప్రాధమిక దశలో కౌన్సెలింగ్, సైకో థెరపీ, గైడెన్స్, హిప్నో థెరపి ద్వారా తగ్గించవచ్చు.మలి దశలో ఔషధాల ద్వారా మెదడు లో కొన్ని రసాయనాల ఉత్పత్తి ని నియంత్రించేలా చేస్తారు.
అక్టోబర్ నెల ప్రపంచ మానసిక ఆరోగ్య మాసం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో పార్క్ లలో అనాధ గృహాలలో అవగాహన కార్యక్రమాలు
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్, సైకో థెరపీస్ట్,హిప్నో థెరపీస్ట్













Comments