Minister G. KISHAN Reddy's response on women's issues.
- Mind and Personality Care

- May 5, 2022
- 1 min read
* మహిళా సమస్యలపై స్పందించిన మంత్రిజి.కిషన్ రెడ్డి*

మహిళా సమస్యలపై మంత్రి జి.కిషన్ రెడ్డి తో చర్చించిన డా హిప్నో పద్మా కమలాకర్, పి.స్వరూపా రాణి.
నమస్కారం నుంచి సమస్కారం నేర్పించే మహిళా మణులకు అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్, పి.స్వరూపా రాణి మంత్రి వర్యులు జి.కిషన్ రెడ్డి గారికి మెమోరాండమ్ సమర్పించారు. మహిళలు పురుషులతో సమానంగా మరియు మెరుగ్గా పని చేస్తున్నా సమస్యలు చుట్టుముడుతున్నాయన్నారు.
చిన్నతనం నుండి మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఊహించలేనంతగా ఉన్నాయన్నారు. చిన్నారులకు విద్యను తిరస్కరిస్తున్నారని, అయితే వారు వంటగది కే పరిమితమవ్వాలనే ఆంక్షలు పెరిగిపోతున్నాయని తెలిపారు. మహిళల పాత్ర ను తిరోగమనం వైపు తీసుకెళ్ళుతున్నారన్నారు. లైంగిక వేదింపులు, గృహహింస, యాసిడ్ దాడులు, హత్యలు, ఆత్మహత్య కు ప్రేరేపించడం, వంటివి పెరిగిపోతున్నాయన్నారు.
సమాజం స్త్రీలపై విధించే ఒత్తిడి మరియు పరిమితులు కనీసం చెప్పాలంటే భయంకరంగా ఉన్నాయని తెలిపారు. తరువాతి తరానికి అందరూ సమానమని తెలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. భారతదేశంలో సమానత్వం ఇప్పటికీ ఒక కలగానే ఉందని దానిని నిజం చేసే అవకాశం కిషన్ రెడ్డి గారికి ఉందని తెలియ చెప్పారు. కిషన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి విశాల దృక్పథంతో స్త్రీలను సమానులుగా అంగీకరించాలన్నారు. సమస్య ఏదైనా ఉంటే మహిళలు హృదయపూర్వకంగా నిస్వార్థంగా ఉంటారని తెలిపారు. మానసికంగా,అనుభవాల కారణంగా మహిళలు తెలివైనవారు మరియు బలవంతులని తెలిపారు.నా సపోర్ట్ ఎప్పుడు కావాలన్నా ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరుపున ఎ సహాయం అయినా చేస్తానని చెప్పారు. ఆయనకు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్, డా.పి.స్వరూప రాణి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
డా హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్ హిప్నో థెరపిస్ట్
@9390044031

Comments