Netaji is the inspiration for today's youth
- Mind and Personality Care

- Jan 23, 2024
- 2 min read
నేతాజీ నేటి యువతకు స్పూర్తి
డా.హిప్నో పద్మా కమలాకర్
నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఒక భారతీయ జాతీయవాది. భారతదేశం పట్ల దేశభక్తిని చాలా మంది భారతీయుల హృదయాలలో ముద్ర వేసారు. (జనవరి 23) స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. బోస్ పుట్టిన రోజును శౌర్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
సుభాష్ చంద్రబోస్ 1897 లో, భారతదేశంలోని ఒడిషా లోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయరు. గొప్ప జాతీయవాది. బెంగాల్ శాసనమండలికి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభావతి దేవి. బోస్ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజిలో చదివాడు.
1920 లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొననారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించారు.
విమాన ప్రమాదంలో కాలిన గాయాలతో బాధపడుతూ తైవాన్‌లోని ఆసుపత్రిలో 18 ఆగస్టు, 1945న మరణించారు.
సుభాస్ చంద్రబోస్ అసాధారణ నాయకత్వ నైపుణ్యాలు, ఆకర్షణీయమైన వక్తతో అత్యంత ప్రభావవంతమైన స్వాతంత్ర్య సమరయోధుడిగా పరిగణించబడ్డారు. అతని ప్రసిద్ధ నినాదాలు ' తుమ్ ముజే ఖూన్ దో, మెయిన్ తుమ్హే ఆజాదీ దుంగా', 'జై హింద్' మరియు 'ఢిల్లీ చలో'. అతను ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించాడు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అనేక రచనలు చేశాడు. అతను స్వాతంత్ర్యం పొందటానికి, సోషలిస్ట్ విధానాలకు తన మిలిటెంట్ విధానానికి ప్రాణం పోసాడు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్
" మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను " అన్న మాటలు , బ్రిటీష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం కోసం పోరాటంలో అసంఖ్యాక భారతీయ యువకులను ప్రేరేపించాయి. ఇప్పటివరకు జన్మించిన అత్యుత్తమ నాయకులలో ఒకరైన నేతాజీ భారత విముక్తి పోరాటంలో కీలక పాత్ర పోషించారు.
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. బోస్ పిలుపుతో చాలా మంది దేశ భక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైనా బోస్ అజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని మానలేదు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. పిల్లలకు నేతాజీ గురించి తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు తెలియ చెప్పాలసిన అవశ్యకత ఎంతైనా ఉంది.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్ హిప్నో థెరపిస్ట్
@ 9390044031













Comments