Never get discouraged and stop trying!
- Mind and Personality Care

- Jan 20, 2022
- 1 min read
ధైర్యం వీడకు... అడుగులు ఆపకు

వేయి మైళ్ల ప్రయాణమైన ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. మీ జీవితం కూడా ఓ ప్రయాణమే. ఈ ప్రయాణంలో ప్రతీ మనిషికి అనేక కలలు ఉంటాయి. ఆ కలలు ఫలించాలంటే.. ముందు మీరు ధైర్యంగా మీ ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఈ ప్రయాణంలోనే మీ జీవిత కలలను సాకారం చేసుకోవచ్చు. ఇందుకు ముందుగా మీరే ధైర్యంగా ముందడుగు వేయాలి. మీరు వేసే ప్రతీ అడుగు ఒక మార్పుకు శ్రీకారం చుడుతుంది. *సహనం అవసరం...* ఈ ప్రయాణంలో మీకు సహనం ఉండాలి. ఫలితం ఒక్కోసారి వెంటనే కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు ఈ ప్రయాణంలో మలుపులు కూడా ఉంటాయి. అయినా ఓర్పు వహించాలి. నేర్పుతో మెలగాలి. మీరు గడిపే ప్రతీరోజూ, ప్రతీ క్షణం మిమ్మల్ని మీ గమ్యానికి దగ్గరగా చేరుస్తూ ఉండాలి. ఈ ప్రయాణంలో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. ప్రతీ రోజూ మీరు మీ గమ్యానికి ఎంత వరకు చేరుకున్నారో మీరే పరిశీలించుకోవాలి. ఇలా నిత్యం మీకు మీరే పరిశీలకులుగా ఉండి ఆత్మవిమర్శ చేసుకోవాలి. *మీ జీవితానికి మీరే బాధ్యులు!* ఇది మీ జీవితం. దీనిని క్రమపద్ధతిలో పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఇలా నిబద్ధతతో మీరు పనిచేసుకుంటూ వెళితే.. ఏదో ఒక రోజు మీరు తప్పకుండా ఉన్నత స్థానంలో ఉంటారు. మీరు మంచి స్థాయికి వెళుతున్న కొద్దీ మీ జీవితంలోని కలలు క్రమంగా సాకారం అవుతూ ఉంటాయి. మీరు వేసే ప్రతీ అడుగు మీ జీవితానికి బంగారు బాటలు వేస్తుంది.


Comments