Salute to Dad
- Mind and Personality Care

- Jun 20, 2022
- 1 min read
నడక, నడతను నేర్పేనాన్నకు నమస్కారం
ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్
నడక నుంచి నడతను నేర్పే నాన్నలకు
నమస్కారాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాజమండ్రిలో న్యూరో సర్జరీ హాస్పిటల్లో (*జూన్ 19 పితృ దినోత్సవం సందర్భంగా) పితృ దినోత్సవ వేడుకలు చేశారు. సోనోరా డాడ్ అనే మహిళ తండ్రులందరి ప్రేమ మరియు జీవితకాల త్యాగాల కోసం 1910 లో, ఫాదర్స్ డే వేడుకలను ప్రారంభించింది.ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ డా.పి.రమేష్ కుమార్, సునీతా, కృష్ణ వేణి, పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం సైనికులు పని చేస్తే, కుటుంబ రక్షణ కోసం నాన్న అహర్నిశలు పని చేస్తాడన్నారు.
ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మ అయితే, ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేవాడు నాన్న’ అని అన్నారు. జీవన విధానాన్ని, నడక, నడవడిక, నాగరికత, సమాజంలో మనగలిగే ఒడుపు, లౌకిక వ్యవహారాలు, మనుగడకు మెలకువలు లాంటివెన్నో నేర్పించేది నాన్నే నన్నారు. తండ్రి బిడ్డ చెయ్యి పట్టుకు నడిపించడమంటే దారి చూపడం కాదని, భవిష్యత్తులోకి దారితీయడమని తెలిపారు.
తనకు కలిగే కష్టాలు, తగిలే గాయాలు బహిర్గతం చేయని మగ మహారాజన్నారు.
కాఠిన్యాలూ, కన్నెర్రజేయడాలూ ప్రేమలేక కాదు, దాన్ని వ్యక్తం చేయలేకా కాదు. ఎదుగుదల ఆగక, విజయపథంలో దూసుకుపోవాలన్న ఆరాటమే ఆయన్ని మౌనంగా ఉంచేస్తుందని చెప్పారు.
పిల్లలు గెలిచినప్పుడు మనసులోనే అభినందిస్తాడన్నారు. పిల్లలు ఓడిపోతే భుజం తట్టి ధైర్యం చెబుతాడన్నారు. అదే నాన్న నైజం, ఔన్నత్యం అని తెలిపారు. తప్పటడుగుల వయసులో చేయూతనందించి, తెలిసీ తెలియక చేసిన తప్పులను సరిదిద్దే దినాన్నే నన్నారు.
పిల్లలకు ఏది, ఎంత, ఎప్పుడు, ఎలా ఇవ్వాలో, వేటిని ఇవ్వకూడదో క్షుణ్ణంగా తెలిసిన వాడే నాన్న న్నారు. అతడి హృదయం లోతైనది. మాట కటువు, మనసు సున్నితమని తెలిపారు. నాన్నకి మనపట్ల ఇష్టంలేదనుకోవడం అవివేకం, ఆయనది అవ్యాజప్రేమమని చెప్పారు.ఒక్క మాటలో చెప్పాలంటే నాన్న ప్రేమిస్తాడు, వ్యక్తం చేయడు. ఆదరిస్తాడు, ఆర్భాటం చేయడు. అందుకే అనాదిగా ఆయన పూజ్యనీయ స్థానంలోనే ఉన్నాడు. నిరంతరం పిల్లల ఉన్నతిని కాంక్షించే నాన్న పట్ల భయభక్తులే కాదు మమతానురాగాల్నీ పంచాలి. అదే ఆయనకిచ్చే సిసలైన గౌరవం, మనందరి తరపున నాన్నకు హృదయపూర్వక సెల్యూట్ చేద్దామని తెలిపారు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో,థెరపిస్ట్ హిప్నో థెరపిస్ట్
@9390044031









Comments