top of page
Search

See yourself with the eyes of a Sculptor!

ఓ శిల్పి కళ్ళతో మిమ్మల్ని చూడండి!?


ree

ఒక రాయి సాధారణ వ్యక్తులందరికీ మామూలు రాయిగానే కనిపిస్తుంది. ఒక శిల్పి మాత్రం ఆ రాయిలో అంతర్లీనంగా దాగి ఉన్న అద్భుత శిల్పాన్ని చూస్తాడు. ఆ రాయిని జాగ్రత్తగా భద్రపరిచి, దానిపై సుత్తితో నెమ్మదిగా కొడుతూ... క్రమక్రమంగా దానికి ఒక రూపం ఇస్తాడు. శిల్పాన్ని చెక్కేటపుడు ఆయన ఏకాగ్రత అంతా ఆ రాయిమీద ఉంటుంది. ఆయనకు ఆ రాయిలో దాగి ఉన్న అద్భుత కళాకండమే కనిపిస్తూ ఉంటుంది. అదును చూసుకుంటూ.. జాగ్రత్త పడుతూ.. ఒక కళాత్మక రూపానికి ప్రాణం పోస్తాడు. ఒక రాయి కళాకండంగా మారడం వెనుక ఆ శిల్పి యొక్క అనంతమైన శ్రమ దాగి ఉంటుంది. అంతకుమించి అద్భుతమైన కళానైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యంతోనే అతను దానిని తన కలల ప్రతిరూపంగా మార్చుకుంటాడు. తను కలలు గన్న రూపం తనకు మాత్రమే కాదు.. నలుగురికీ నచ్చే విధంగా రూపొందిస్తాడు. అందరిచేత ప్రశంసలు అందుకుంటాడు.  మీ జీవితం కూడా ఓ రాయి లాంటిదే. మీ జీవితాన్ని సాధారణ వ్యక్తుల్లా గమనిస్తే.. అందులో దాగి ఉన్న మజా ఏమిటో మీకు తెలియదు. మీ జీవితాన్ని ఓ శిల్పి కళ్లతో చూడండి. మీ జీవితంలో మీకు తెలియని ఓ కలల రూపం కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఆ కలల సాకారం కోసం ప్రతీ క్షణం పరితపిస్తూ.. శ్రమించండి. అవకాశం దొరికిన ప్రతీ చోట మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి. కష్టపడండి. చివరకు మీరు ఊహించిన కలల ప్రపంచం మీ ముందు సాక్షాత్కరిస్తుంది. చివరగా ఈ ప్రపంచంలో మీకు అనంతమైన ప్రేమ, అద్భుత వ్యక్తిత్వం మీ సొంతమవుతుంది. ఫలితంగా ఆనందం, అంతకు మించిన స్వేచ్ఛ మీకు లభిస్తుంది.  ఈ ప్రయాణంలో మీకు కొన్ని సార్లు కష్టాలు కూడా ఎదురుకావొచ్చు. కానీ కష్టాలు ఎదురైన సమయంలో కన్నీరు కార్చకూడదు. మీ నైపుణ్యంతో వాటిని అధిగమించాలి. సాధ్యాసాధ్యాలను గమనించాలి. అదునుచూసి అవకాశాన్ని పట్టుకోవాలి. ఆ అవకాశాలే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తాయి. ఈ జీవితంలో మీకు వచ్చే ప్రతీ అవకాశాన్ని ఈ ప్రకృతి సృష్టిగా భావించాలి. ప్రకృతి ప్రసాదాన్ని చేజేతులా అందిపుచ్చుకున్నప్పుడే మీరు కోరుకున్న జీవితం మీ సొంతం అవుతుంది. మీ కలలకూ ఓ రూపం లభిస్తుంది. 



ree


 
 
 

Recent Posts

See All
Intermediate student murdered..

* ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య * విద్యార్థుల ప్రేమ – అపార్థాల ఒడిలో మానసిక సంక్షోభం ప్రస్తుతం విద్యార్థుల్లో ప్రేమ అనే భావన చాలా వేగంగా...

 
 
 
"Win your heart... and the world will follow."

" మన గుండెను గెలిస్తే ... ప్రపంచం మనదే !" "మాట చెప్పాలనుకున్నా... మాట తప్పిపోతుంది! మాట వినాలనుకున్నా... అర్థం మళ్లిపోతుంది! అది...

 
 
 

Comments


093900 44031

Flat No. 306 , 1-10-233/A, Nischint Towers, Indira Park Road, Lower Tank Bund, Lower Tank Bund, Kavadiguda, Hyderabad, Telangana 500020, India

Privacy Policy            Terms and Conditions           Cancellation/Refund Policy

©2021 by Dr. Hypno Kamalakar's Mind and Personality Care. Proudly created with Wix.com

bottom of page