Spread the importance of Republic Day
- Mind and Personality Care

- Jan 20, 2022
- 1 min read
* గణతంత్ర దినోత్సవ ఆవశ్యకతను చెప్పాలి*
ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్.
కేంద్ర మంత్రి శ్రీ.జి.కిషన్ రెడ్డి గారికి అల్లూరి సీతారామరాజు పుస్తకాన్ని అందిస్తున్న జయసూర్య.డా.హిప్నో పద్మా కమలాకర్.
స్వాతంత్ర్య అమృత మహోత్సవం పురస్కరించుకొని జనవరి 26 గణతంత్ర దినోత్సవ ఆవశ్యకతను విద్యార్థులకు, యువతకు తెలియ చెప్పాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, కోశాధికారి పి.స్వరూప రాణి, పి.ఓఋల్ రెడ్డి స్కూల్ పి.టి.టిచర్ అన్నపూర్ణ, సంయుక్తంగా తెలిపారు. గురువారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ హాల్లో పత్రికా విలేఖరులు సమావేశం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత తెలియని విద్యార్థులకు ఇదొక సెలవు, సరదాగా సినిమాలు, షికార్లు, షాపింగ్‌లతోనూ కాలక్షేపం చేస్తున్నారన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి సమిధలైన గొప్ప వ్యక్తుల గురించి ఎవరూ చెప్పటం లేదన్నారు. జాతీయ సెలవు రోజున వారి ఆదర్శాలను పాటించేలా చెయాలన్నారు. దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి సరైన అవగాహన ఉండటం లేదన్నారు. భారత జాతీ నిర్మాణ సమర యోధులు జీవిత విశేషాలను యువతకు తెలియ జేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దాదాపు 2 శతాబ్దాలు పాటు ఆంగ్లేయులు పాలనలో ఉన్న భరత మాతకు.. సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించిందన్నారు. దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది ధన మాన ప్రాణత్యాగాలు చేశారన్నారు. అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన గాంధీ.. జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారన్నారు. స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే రిపబ్లిక్ డే.. అని అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదన్నారు.10 సంవత్సరాల నుంచి చాలా స్కూల్స్ లో జెండా వందనమే చేయటం లేదన్నారు. ప్రతి స్కూల్, కాలేజీ, ఆఫీస్ లలో గణతంత్ర దినోత్సవం తప్పనిసరిగా చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సినిమా హాల్ లో జాతీయ గీతాన్ని పెట్టించి జాతీయ భావాలు పెరిగేలా చేసారు. సినిమాలో ప్లాస్టిక్ జెండాకు బదులు ఖద్దరు జెండా చూపిస్తే బాగుంటుందన్నారు. భారత ప్రభుత్వ కేంద్ర పర్యాటక సాంస్కృతిక మరియు ఈశాన్య ప్రాంత అభి వృద్ధి శాఖా మంత్రి గౌరవనీయులు శ్రీ .జి.కిషన్ రెడ్డిగారి సారధ్యంలో భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవ్ సందర్భంలో, సినియర్ జర్నలిస్టు జయసూర్య రాసిన , విప్లవ తపస్వి అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవ సందర్భంలో వెలువరిస్తున్న సంక్షిప్త వీర గాథ.





Comments