STRESS SETBACKS AN INDIVIDUAL
- Mind and Personality Care

- Nov 2, 2022
- 1 min read
అంతర్జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవాన్ని నవంబర్‌లో ప్రతి మొదటి బుధవారం ఈ సంవత్సరం నవంబర్ 2 ,2022.
*ఒత్తిడి మనుషులను ఓడిస్తుంది*
ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్. ఒత్తిడి మనుషులను ఓడిస్తుందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. బుధవారం హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, నవభారత్, ప్రకృతి 320/A లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో * ఒత్తిడి పై అవగాహన అనే అంశంపై హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో సెమినార్ నిర్వహించారు. మనసు ప్రశాంతంగా ఉంటే అంతా సవ్యంగానే ఉంటుందన్నారు. కానీ ప్రస్తుతం ఎంతోమందిలో కొరవడుతున్నది ఇదేనని చెప్పవచ్చన్నారు. తీరికలేని పనుల్లో మునిగిపోవటం, సమయానికి పనులు ముగించలేకపోవటం వంటివన్నీ మనసును బాగా దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఆలోచనలను అస్తవ్యస్తం చేసి ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు దారితీస్తున్నాయన్నరు.నియంత్రణలో లేని పరిస్థితుల గురించి ఒత్తిడికి గురికావద్దని మిమ్మల్ని మీరు గుర్తుచేసుకునే రోజుని తెలిపారు. లవ్ చేయడం లోను, ఫెయిల్ అవడం లోను, చెడు అలవాట్లను అలవాటు చేసుకోవడం లో తగ్గెదెలే అంటూ దుసుకుపోతున్న విద్యార్థులు బాగా ఒత్తిడికి లోనవుతున్నారన్నారు.చేసే పనిలో నైనా, వెళ్ళే దారిలో నైనా కొత్త దనం లేకపోవడం కూడా ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. ఒత్తిడిని తగ్గించడానికి కలిసి పనిచేయాలన్నారు. నియంత్రణలో లేని పరిస్థితుల గురించి ఒత్తిడికి గురికావద్దని తెలిపారు . దీర్ఘకాలిక ఒత్తిడి యొక్క దుష్ప్రభావాల గురించి, దానిని ఎలా నిరోధించవచ్చు తెలియజేసారు . ఒత్తిడి కారణంగా ఏర్పడే తీవ్రమైన ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించారు. ఒత్తిడి నివారణకు టెక్నిక్స్ ను ప్రాక్టీస్ చేయించారు. ఈ కార్యక్రమంలో పి.స్వరూపా రాణి,జి.కృష్ణవేణి, డా.నాగేశ్వరి,తల్లి దండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డాహిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్
రాజమండ్రి, హైదరాబాద్ @ 9390044031/40







Comments