The Lessons our Legs teach us!
- Mind and Personality Care

- Jan 27, 2022
- 1 min read
* మన కాళ్ళు నేర్పే పాఠాలు!?*

మీకు నడవడానికి రెండు కాళ్లు ఉన్నాయి. ఈ రెండు కాళ్లను అవసరానికి అనుగుణంగా కదుపు తుంటారు. నడవడానికి ఈ రెండు కాళ్లలో ఏది ముఖ్యమో చెప్పగలరా ? అసలు ఎలా నడవగలుగుతున్నారో ఎపుడైనా గమనించారా ? ఒక్కసారి మీ నడకను గమనించండి. మీరు నడిచేటపుడు రెండు కాళ్లను ఏకకాలంలో ఒకేవిధంగా ఉపయోగిస్తున్నారా ? మీరు నడిచేటపుడు ఒక కాలు భూమి మీద ఉంటుంది. మరో కాలు గాలిలో ఉంటుంది. భూమి మీద ఉన్న ఒక్క కాలే మీ శరీర బరువును మోస్తుంది. మరి రెండో కాలు మీకు ఉపయోగపడటం లేదని భావించవచ్చా? అయితే రెండు కాళ్లను భూమి మీదే పెట్టండి. ఇపుడు కాళ్లు గాలిలో లేవకుండా నడవడానికి ప్రయత్నించండి. మీరు నడవలేరు. రెండు కాళ్లు భూమి మీద పెడితే మీరు నిలబడగలరు తప్పితే.. నడవలేరు. అలాగని మీరు రెండు కాళ్లను గాలిలో పెట్టారనుకుందాం.. అపుడు పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు... మీరు ప్రమాదంలో ఉన్నారని గుర్తించవచ్చు. *శ్రమ, విశ్రాంతి ల కలయికే సుఖం!* మీ జీవిత ప్రయాణం కూడా ఇదే విధంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో కొన్ని సార్లు అవిశ్రాంతంగా పనిచేయాల్సి ఉంటుంది. మరికొన్ని సార్లు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నంతమాత్రాన మీరు జీవితం గురించి పట్టించుకోవడం లేదని అనడానికి లేదు. ఆరోగ్యకరమైన జీవితానికి పనితో పాటు విశ్రాంతి కూడా అవసరమే. అలా అని జీవితం అన్నివేళలా ఇంత ప్రశాంతంగా ఉండదు. కొన్నిసార్లు అలుపెరగకుండా తీవ్రంగా శ్రమించాల్సి కూడా రావొచ్చు. ఇలా శ్రమించినపుడు విశ్రాంతి యొక్క విలువేమిటో తెలుస్తుంది. *కష్టం + సుఖం = ఆనందం...* శ్రమించడం కష్టం అవుతుందని ఎల్లవేళలా విశ్రాంతి తీసుకోవడం కూడా సరియైనది కాదు. ఎప్పుడూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే జీవితంలో బద్ధకం పెరిగిపోతుంది. దీనివల్ల మీ జీవితం నిరర్థకం అవుతుంది. జీవితం సాఫీగా సాగిపోవాలంటే శ్రమ ఉండాలి... శ్రమతో పాటు విశ్రాంతి కూడా ఉండాలి. పగలు, రాత్రి గడిచినపుడే ఒక రోజు ముగిసినట్లుగా... కష్టం, సుఖం ఉన్నపుడే జీవితం ఆనందంగా గడుస్తుంది


Excellent
Super