The Woman who says Yes for the challanges
- Mind and Personality Care

- Mar 21, 2022
- 1 min read
సవాళ్ళకు సై అంటున్న మహిళలు
హైకోర్టు జడ్జి డా.రాధరాణి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ విశ్వగురు వ్యవస్థాపకులు శ్రీ ఎస్.రాంబాబు, ఎస్.పూజిత ఆధ్వర్యంలో "క్వీన్ ఆఫ్ ది నేషన్ " అవార్డులు ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయంగా ప్రసాద్ ఫీల్మ లెబరటీస్ హాల్లో, హైదరాబాద్ లో అనేక రంగాలకు చెందిన 30 మంది మహిళలకు ఇచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు జడ్జి డా.రాధరాణి మాట్లాడుతూ సాధికారత అంటే.. ఏ ఒక్క రంగానికో పరిమితం కాదన్నారు.. ఇంట్లోని బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే.. అటు వృత్తినీ బ్యాలన్స్ చేస్తుందన్నారు. తల్లిగా పిల్లల్ని ఉత్తమంగా తీర్చిదిద్దడం, ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా ఉంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేయడం, ఇలా ఎన్ని పనులతో తీరిక లేకుండా ఉన్నా.. తనకంటూ కాస్త సమయం కేటాయించుకొవాలన్నారు. ఆరోగ్యంగా-ఫిట్‌గా మారడం.. మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. హక్కులు, అవకాశాలు కావాలి అని దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్న ఇంకా లింగం సమానత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. సవాళ్ళకు సై అంటూ స్త్రీలు ముందుకు దూసుకుపోతున్నారు న్నారు. అతివ అన్ని కోణాల్లో అభివృద్ధి సాధిస్తేనే సంపూర్ణ సాధికారత సాధించినట్లు లెక్క అని తెలిపారు.
గౌరవ అతిథి ఐఎఎస్ అధికారి శ్రీ బి.లక్ష్మీకాంతమ్ మాట్లాడుతూ తమ ఉనికితో పాటు విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకియ రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తునే వాటికోసం కృషి చేస్తున్నారన్నారు. జీవితం లో అనుకున్న లక్ష్యాలను పట్టుదలగా సాధించి ఉన్నత శిఖరాలను మహిళలు అధిరోహించగలరన్నారు.
మరో గౌరవ అతిథి రిటైర్ ఐఎఎస్ అధికారి సి.గోపినాధ్ రెడ్డి మాట్లాడుతూ ఆడ,మగ ఇద్దరూ సమానమే అన్నారు. ఇద్దరూ బాగుంటేనే కుటుంబం సమాజం ప్రపంచం బాగుంటుందన్నారు.
* ఈ అవార్డు ప్రతి మహిళకు అంకితం *
"క్వీన్ ఆఫ్ ది నేషన్ " అవార్డు సోషల్ సర్వీస్ లో డా.వి.జే.క్యార్లన్ కి, స్కూల్ ఎడ్యుకేషన్ లో శోభా, సైకాలజీ రంగంలో డా.హిప్నో పద్మా కమలాకర్ కు ఇవ్వడం జరిగింది. హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని పనులను సమర్థ వంతంగా నిర్వహించాలంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరమన్నారు. మహిళ తనలోని శక్తి, సామర్థ్యాన్ని గుర్తించి, తనను తాను ప్రేమించుకొవాలన్నారు. తన విలువను కాపాడుకున్న ప్పుడే ప్రతి రోజూ మహిళా దినోత్సవం అవుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రతి మహిళకు ఈ అవార్డు అంకితం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైయన్ యాదయ్య గౌడ, లైయన్ సత్యనారాయణ పాల్గొన్నారు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్, ఫ్యామిలీ, మ్యారేజ్,& హెల్త్ కౌన్సెలర్.9390044031







Comments