TO BE HAPPY
- Mind and Personality Care

- Feb 17, 2022
- 1 min read
సంతోషంగా ఉండాలంటే..
సంతోషం మన చేసే పనిలోనే ఉండదు. అది మన ఆలోచన, మాటలు, చేతల సమ్మేళనం. మనం ఏం చేస్తామో అదే మాట్లాడుతాం. ఏం మాట్లాడుతామో... అదే ఆలోచిస్తాం.
* - జె.పి. వస్వాని*
1. సంతోషం ఎప్పుడూ కూడా మీ మెదడు పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది.
2. సంతోషాన్ని అందరికీ పంచండి... అది మిమ్మల్ని మరింత సంతోషపరుస్తుంది.
3. మీలోని బలాలను గుర్తించండి... అవి మీకు మరింత స్ఫూర్తినిస్తాయి.
4. మార్చలేము, సాధ్యం కాదు అనే పదాలను మీ డిక్షనరీ నుంచి తీసేయండి. మీరు తలచుకుంటే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి.
5. ధైర్యంగా ఉండండి... ఎప్పుడూ భయపడకండి, బాధపడకండి. ధైర్యం..మిమ్మల్ని నైరాశ్యం నుంచి బయటపడేస్తుంది.
6. చిన్న చిన్న విషయాలే కదా అని నిర్లక్ష్యం గా వుండకండి... మీ జీవితమేమీ పూల పాన్పు కాదు.
7. విమర్శలకు చింతిస్తూ కూర్చోకండి... అవి మీకు దిశా నిర్దేశం చేసే మార్గదర్శకాలుగా భావించండి.
8. క్షమాగుణాన్ని అలవర్చుకోండి... అది మిమ్మల్ని స్వేచ్ఛగా విహరింపజేస్తుంది.
9. ప్రతిఫలాలను ఆస్వాదించండి... అవి మిమ్మల్ని మరింత ప్రకాశవంతంగా చేస్తాయి.
10. అందమైన జీవితాన్ని ఆవిష్కరించండి. ఎందుంటే మీకు ఉన్నది ఒకే ఒక జీవితం.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్





Super explained madam. Great.