To succeed in life, love the Ups and Downs in your life!
- Mind and Personality Care

- Feb 3, 2022
- 1 min read
కష్టనష్టాలు తో ఇష్టమైన జీవితం
జీవితంలో వృద్ధిలోకి రావాలంటే...
మీరు ఖచ్చితంగా కష్టనష్టాలు (రిస్క్) భరించాల్సి ఉంటుంది. కష్టనష్టాలు లేకుండా జీవితం గడపాలంటే అది అత్యాశే అవుతుంది. మానవ జీవితంలో ప్రతీ అడుగు కూడా కష్టనష్టాలుతో కూడుకున్న వ్యవహారమే. కనీసం ఇతరులను ప్రేమించాలన్నా కూడా. ఎందుకంటే మీరు ఇతరులను గౌరవిస్తారు.. ప్రేమిస్తారు. కానీ వారు మీ పట్ల అంతే ప్రేమగా వ్యవహరిస్తారని ఖచ్చితంగా చెప్పలేము. సందర్భాన్ని బట్టి, పరిస్థితులకు అనుగుణంగా ఇతరులు మీతో మాట్లాడతారు. వారు మిమ్మల్ని ఎలా స్వీకరిస్తారో కూడా కనీసం అంచనా వేయలేని పరిస్థితులు ఉంటాయి. ఈ సమాజంలో ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ జీవితం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా... అందులో కూడా కొన్నిసార్లు కష్టనష్టాలు ఉండవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాల ఆధారంగా కూడా జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పలేము.
*కష్టనష్టాల కలయికే జీవితం!*
జీవిత ప్రయాణంలో ప్రతీ ఒక్కరూ కష్టనష్టాలు భరించే ఉంటారు. ఈ సమాజంలో మనుగడ సాధించాలంటే ఇతరులతో సాన్నిహిత్యం తప్పనిసరి. కానీ సమాజంలో ఉన్న ప్రజలను నమ్మడం కూడా ఇబ్బందే. ఎందుకంటే ఆ ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు.
*భయం వీడితే ఆనందం మీదే!*
అయితే జీవితం కష్టనష్టాలుతో కూడుకున్నదని ఎపుడూ భయపడకూడదు. అసలు.. జీవన స్వరూపమే అలా వుంటుందన్న విషయాన్ని గుర్తించాలి. జీవితంలో ఇబ్బందులు గురించి భయపడేవారు, వాటికి దూరంగా జీవితాన్ని గడిపేవారు ఎవరూ కూడా జీవితంలో ఆనందాన్ని పొందలేరు. కష్టనష్టాలు గురించి ఆందోళన చెందేవారు ఎల్లప్పుడూ భయం భయంగా జీవిస్తూ ఉంటారు. ఆ భయం వల్ల వారి జీవితంలో ఆనందం ఆవిరైపోతుంది.
*భరిస్తే బహు చక్కని జీవితం!*
మనిషి జీవితంలో మధురమైన అనుభూతులను పొందాలనుకుంటే కష్టనష్టాలు కూడా భరించేందుకు సిద్ధం కావాలి. అయితే ఎపుడు భరించాలి, ఎపుడు వదిలిపెట్టాలి అనేది నిర్ణయించుకోవడం ఇక్కడ చాలా కీలకం. సమస్యలు ఎదురైనపుడు వాటిని దాటుకోవాలంటే కాస్త తెలివిగా వ్యవహరించాలి. అనవసరంగా ఆందోళన చెందకూడదు. ముందుగా కాస్త మౌనం వహించండి. మీ మెదడును ప్రశాంతంగా ఉంచుకోండి. కాసేపు కళ్లు మూసుకుని విషయం పై మీ దృష్టిని కేంద్రీకరించండి. అపుడు మీకు దాని నుంచి బయటపడేందుకు కొన్ని అవకాశాలు దొరకుతాయి. కొన్నిసందర్భాల్లో ఈ కష్టనష్టాలు నుంచి బయటపడేందుకు మీ చుట్టూ ఉన్న స్నేహితులు, ఇతరులు కూడా మీకు సహాయపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచనను ఉపయోగించి వాటి నుంచి బయటపడితే దానిలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేనిది. సమస్యలు లేకుండా అసలు జీవితమే ఉండదు. వాటి మూలంగానే జీవితంలో ఉండే మజా ఏమిటో తెలుస్తుంది.
డా.హిప్నో పద్మాకమలాకర్





Comments