Tobacco that depletes the energy of youth
- Mind and Personality Care

- May 31, 2022
- 2 min read
పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా
*యువ శక్తి ని హరిస్తున్న పోగాకు *
ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్
పొగాకు వాడకం వల్ల యువ శక్తి అంతరించి పోతుందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, తెలిపారు. యువత జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలనే ఆలోచన తో సిగరెట్లు తాగుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని ఆమె తెలిపారు.
డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ హాల్లో పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా మంగళవారం ఉదయం సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ ఎల్. లక్ష్మి దేవి, మహాత్మా జ్యోతిభా పూలే బిసి వెల్ఫేర్ స్కూల్ టీచర్ ఎస్.సురేష్ , డా. క్యార్లిన్, డా.పి.స్వరూప రాణి, గైనకాలజిస్ట్ డా.నాగేశ్వరి, పాల్గొన్నారు.
సిగరెట్, చుట్ట, బీడీలను ముట్టించి గుండెల నిండా పీల్చుకొని ఉత్సాహం వచ్చినట్టు భావించేవారు ఎందరో ఉన్నారన్నారు. పొగాకు సంపూర్ణ క్యాన్సర్ కారకం మని తెలిపారు.పొగాకు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నికోటిన్. దీని మూలంగానే పొగాకు వాడకం అలవడేలా, వ్యసనంగా మారేలా చేస్తుందని తెలిపారు. ఒకట్రెండు సిగరెట్లు కాలిస్తే ఏమీ కాదని కొందరు భావిస్తుంటారన్నారు.విషం ఒక చుక్క తాగినా, పది చుక్కలు తాగినా పోయేది ప్రాణాలే. పొగాకూ అంతేనన్నారు. దీని వాడకంలో సురక్షిత మోతాదు అంటూ ఏదీ లేదని చెప్పారు. సిగరెట్లు,బీడీలు, చుట్టలు కాల్చటం వల్ల క్యాన్సర్ల ముప్పు గణనీయంగా పెరుగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఎంత వరకు ముప్పు పొంచి ఉంటుందనేది ఆయా వ్యక్తులను బట్టి మారిపోతుండొచ్చన్నారు. రోజుకు ఎన్ని
సిగరెట్లు కాలుస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారనే విషయాలన్నీ ఇందులో ప్రభావం చూపుతాయన్నారు.కొందరు ‘మా తాత 90 ఏళ్ల వరకు పొగ తాగేవారు, ఆయనకేమీ కాలేదు. జీవితాంతం నిక్షేపంగా ఉన్నారు’ అని వాదిస్తుంటారన్నారు. దీనికి కారణం క్యాన్సర్‌కు అనుకూలంగా మారిన కణం తర్వాతి దశలోకి వెళ్లకపోవటమేని తెలిపారు. వారిరోగనిరోధకశక్తి, తినే తిండి, పీల్చే గాలి, వాతావరణం వంటివి దాన్ని అక్కడితో ఆపేసి ఉండొచ్చన్నారు. కానీ అందరిలోనూ ఇలాగే జరగాలని లేదన్నారు. సాధారణంగా చాలామంది తొలిసారి పొగ రుచిని యుక్తవయసులోనే చూస్తుంటారని తెలిపారు. ఏదో ఆసక్తి, ఉత్సుకతతో మొదలై క్రమంగా వ్యసనంగా మారుతుందన్నారు. ఇలా చిన్నప్పుడు పొగ తాగటం అలవాటైనవారికి 35-70 ఏళ్ల
వయసులో ఎప్పుడైనా క్యాన్సర్ రావొచ్చన్నారు. ఆయా వ్యక్తుల శరీర స్వభావాలను బట్టి కొందరికిది త్వరగా రావొచ్చన్నారు. ఎంత చిన్న వయసులో పొగాకు వాడకం అలవడితే అంత తక్కువ వయసులో క్యాన్సర్ వచ్చే అవకాశముందన్నారు.ఏ రూపంలోనైనా ప్రమాదమేనని తెలిపారు. సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చిన వారు వదిలిన పొగను ఇతరులు పీల్చినా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని చెప్పారు. చిన్నప్పట్నుంచే పొగాకు
దుష్ప్రభావాలపై అవగాహన కలిగించాలన్నారు.. క్యాన్సర్ ఆసుపత్రులకు తీసుకెళ్లి పొగ తాగితే ఏమవుతుందో ప్రత్యక్షంగా చూపించాలన్నారు.. పొగాకు దుష్ప్రభావాల గురించి నాలుగో తరగతి నుంచే పాఠ్యాంశంగా బోధించాలని తెలిపారు. ఎందుకంటే ఏడో తరగతికి వచ్చేసరికే ఎంతోకొంత ప్రభావితమైపోతున్నారన్నారు.. ఆ తర్వాత మనసు మార్చటం కష్టమవుతుందన్నారు. పెద్ద అవుతున్నకొద్దీ స్నేహితుల మాట తప్ప ఎవరి మాటా వినరు. సిగరెట్లు తాగేవారి పక్కన కూర్చోవద్దని చెప్పండి.. ఇంట్లో ఎవరినీ సిగరెట్లు కాల్చ కుండా చూడాలి.
మానడం ఎలా ?
* సంకల్పం: ఎలాగైనా, ఎంత కష్టమైనా మానేయగలననే బలమైన సంకల్పం ఉండాలి.
* భరించాలి: దూరమవ్వడం మొదలయ్యాక తాత్కాలికంగా మానసిక, శారీరక బాధల్ని తట్టుకొనే శక్తిని తెచ్చుకోవాలి.
* భయముండాలి: పొగాకుకు మళ్లీ దగ్గరైతే జబ్బులు వస్తాయనే భయముండాలి.
* సంప్రదించాలి: ఎవరైతే పూర్తిగా వదిలేయడం కష్టం అనుకుంటారో వారు అప్పటికే ఈ వ్యసనానికి దూరమైన వారిని తరచూ సంప్రదిస్తూ ఉండాలి.(సైకాలజిస్ట్ లను) మానసిక నిపుణుల్నీ కలవాలి. సమూహాలకు దూరమవ్వాలి.
* ఒక్కో మెట్టు: ఒకేసారి ఆపేయొద్దు. మొత్తం మూడువారాల సమయం తీసుకోవాలి. ఒక్కో వారం 30% శాతం తగ్గిస్తూ రావాలి. 9 సిగరెట్లు అలవాటుంటే దాన్ని 6, 3కు 2కు, 1కి తగ్గించి మొత్తానికే మానేయాలి.
* ప్రకటించుకోవాలి: నేను సిగరెట్లు మానేస్తున్నానని కుటుంబసభ్యులు, స్నేహితుల ముందు ప్రకటించుకోవాలి. అప్పుడే తప్పనిసరిగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.
* అలవాట్లు మార్చుకో: వ్యసనం నుంచి మనసు మళ్లేలా శ్వాస, శారీరక, యోగా వ్యాయామాలు చేయాలి. కొత్త పనులు, ఆలోచనలు, సృజనాత్మకంగా ఉండేలా చూసుకోండి. దగ్గర వాళ్ళతో సమయం గడపాలి.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్ హిప్నో థెరపిస్ట్
@ 9390044031









Comments