Unity is great strength
- Mind and Personality Care

- Nov 2, 2023
- 1 min read
అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకు
ఐక్యమత్వమే.. మహాబలం
డా.హిప్నో పద్మా కమలాకర్, యోగా గురు బి.సరోజని రామారావు, డా.పి. స్వరూపా రాణి
ఐక్యమత్వమే.. మహాబలమని పటేల్ నిరూపించారని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, యోగా గురు బి.సరోజని రామారావు, స్వరూపా రాణి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకు ఇందిరా పార్క్ లో యోగా గురు బి.సరోజని రామారావు, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ భారతదేశ రాజకీయ ఏకీకరణలో ప్రధాన పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారన్నారు. పటేల్‌ను ఉక్కు మనిషి అని పిలుస్తారని చెప్పారు. నవభారత లయన్స్ క్లబ్ సెక్రటరీ పి.స్వరూపా రాణి మాట్లాడుతూ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలు, భాషల భూమి అయిన భారతదేశంలో, ప్రజల మధ్య ఐక్యతను కొనసాగించడం చాలా ముఖ్యమన్నారు. యోగా గురు సరోజని రామారావు మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం రాష్ట్రాలను ఏర్పాటు చేయడంలో, వాటిని భారత యూనియన్ కిందకు తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ప్రముఖ పాత్ర పోషించారన్నారు .అడ్వకేట్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ భారతదేశంలోని అనేక రాచరిక రాష్ట్రాలు విభజించబడిన సమయంలో, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సమైక్య భారతదేశం యొక్క దృక్పథాన్ని పట్టుకొని దాని కోసం వాదించారన్నారు. డా.గీత మాట్లాడుతూ భారతదేశ ప్రజల మధ్య సంఘీభావాన్ని పునరుద్ఘాటించడం దీని లక్ష్యమన్నారు. ప్రజలలో "భిన్నత్వంలో ఏకత్వం" స్ఫూర్తిని కొనసాగించడం దీని లక్ష్యమని తెలిపారు.ఇందిరా పార్క్ లో అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉక్కు మహిళ యోగ గురువు బి.సరోజని రామారావు పుట్టినరోజు ఈ రోజే కావడం విశేషమన్నారు.
అందుకే ఆమెను డా.పద్మా కమలాకర్, పి.స్వరూపా రాణి, జి.కృష్ణ వేణి, కే. సరస్వతి, డా.గీత, పి.స్వరూపా రాణి, యశోద, హిత, శ్రీలత, శారద, అనిత, ఉషా, సైకాలజిస్ట్ జ్యోతి, ధనలక్ష్మి, పూర్ణ, పవన్, ప్రకాష్, ఇంద్రజిత్, దేవేందర్ ,జయప్రకాష్, అడ్వకేట్ రాజేంద్ర కుమార్, ప్రకాష్, వెంకటేశ్వరరావు, రాజు నరసింహ, సుజాత, పూర్ణ, సురేఖ,డా.ఓం ప్రకాష్ కల్పన, ఘనంగా సన్మానించారు.
డా. హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్, సైకోథెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్
@ 9390044031







Comments