Wife and husband should fight
- Mind and Personality Care

- Sep 23, 2023
- 1 min read
Updated: Oct 6, 2023
భార్య, భర్తలూ గొడవలు పడండి
డా.హిప్నో పద్మా కమలాకర్
మధురం మధురం అని వివాహా బంధంలోకి అడుగు పెడతారు..
కొంతకాలం అహో ఒహో అంటూ...
తరువాత మొదలవుతుంది నేను, నావాళ్ళు గొప్ప అంటూ...
పై పై మెరుగులు చూడటం... ప్రతీదీ ప్రతి కూలంగా ఆలోచించడం....
అనుకూలంగా ఉన్నది కనిపించదు..వినిపించదు...
తమబాగు కోసం ఆలోచించలేని వారు
ఎదుటి కొంపకు ఎసరు పెడతారు...
కుటుంబ వ్యక్తులే మీ ఆనందాన్ని ఓర్వలేక ....
మజ్ను లైలాలు అవ్వాలా....
మంచి కంటే చెడే ఎక్కువగా ప్రభావితం చేస్తుంటుంది. ఇద్దరి మధ్య గొడవైనా, మూడో వ్యక్తి వల్ల సమస్య వచ్చినా.. చాలామంది విషయంలో భాగస్వామిని చూసే దృష్టి కోణం ఎప్పుడూ నెగెటివ్‌గానే ఉంటుంది. దీన్నే ‘నెగెటివ్ సెంటిమెంట్ ఓవర్‌రైడ్’ అంటారు. అదే క్షణికావేశం నుంచి బయటపడి.. అవతలి వారిలోని మంచిని చూడగలిగితే..
దంపతుల మధ్య వచ్చే ఎన్నో అభిప్రాయభేదాలకు ఆదిలోనే చెక్ పెట్టవచ్చు . అనుబంధాన్ని పెంచుకోవాలన్నా,
తెంచుకోవాలన్నా.. మనం భాగస్వామిని చూసే దృష్టి కోణం పైనే ఆధారపడి ఉంటుంది. మరి, వారిలో మంచిని చూస్తే ఏ గొడవ ఉండదు. అదే నెగెటివ్ దృష్టితో చూసినప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి. ఈ దృష్టి కోణాన్ని మార్చుకొని అనుబంధాన్ని దృఢం చేసుకోండి.
* లైంగికంగా అనుకూలంగా లేకపోవడంతో
* మీరు అనుకున్న విధంగా (భార్య, భర్త) లేకపోవడం.
* అపనమ్మకం అనే అనుమానం తో ప్రతికూల ఆలోచనలు మొదలవుతాయి. నమ్మకం కోల్పోకుండా ఉండేందుకు.. దంపతులిద్దరూ ఏ
విషయాన్నైనా స్పష్టంగా మాట్లాడుకోవాలి.
* చిన్న చిన్న పనులు విషయంలో
* సరిగా మాట్లాడలేక పోవటం
* వివాహం వివాదాస్పదంగా జరగడం
* ఆర్థిక అసమానతలు..
* తాము చెప్పిందే వేదం అన్నట్లుగా భాగస్వామి ఏం చెబుతున్నారో కొందరు వినరు .
ఇలాంటి వాళ్లు అవతలి వ్యక్తిలో పాజిటివిటీని ఎప్పుడూ చూడలేరు.
* ఎక్కువ గా ఆలుమగల మధ్య పదే పదే గొడవలు మూడవ వ్యక్తి వల్ల జరుగుతాయి.
* భయంతో భాగస్వామినీ ప్రతి విషయంలోనూ నెగెటివ్ దృష్టితోనే చూస్తుంటారు.
* గొడవలు జరిగినప్పుడు అవతలి వారిలో సానుకూలమైన అంశాల్ని చూడగలిగితే..
* గొడవలైనప్పుడు విమర్శించుకోకుండా.. సైలెంట్ గా ఉండండి.
* ఆలుమగలు లైంగికంగా ఎంత దగ్గరైతే.. అంత మంచిది.
* ఇతరులతో ( భార్య, భర్త) పోల్చవద్దు..
* ఇద్దరూ కలిసి వ్యాయామం చేయండి.
*( బయట వారికి) భాదలను బయటకు చెపితే మనసు తేలికైపొతుందనటం అబద్దం...మనిషి చులకనై పోతాడన్నది నిజం... మీరిద్దరూ అర్థమయ్యేలా వివరించుకోండి.
* గొడవలు పడటానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, దగ్గరవడానికి చూపిస్తే ప్రతి బంధం ఎంతో అందంగా ఉంటుంది.
* ఎంత చేసినా ఫలితం లేకపోతే.. నిపుణుల సలహా తీసుకోవడం, కౌన్సెలింగ్‌కి వెళ్లడం.. వంటివి మేలు చేస్తాయి.
అప్పుడప్పుడు గొడవలు జరగాలి.... రోటీన్ జీవితం నుంచి బయటకు వచ్చి....
బాగా ఎంజాయ్ చెయ్యగలరు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్, సైకోథెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్
@ 9390044031/40







Comments