Women's health is the well-being of society.
- Mind and Personality Care

- Mar 15, 2022
- 2 min read
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా * మహిళ ఆరోగ్యమే సమాజ శ్రేయస్సు..*
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం ఇందిరా పార్క్ లో అత్యంత వైభవంగా మహిళా దినోత్సవాన్ని ఇందిరా పార్క్ యోగా సెంటర్ ఇన్ ఛార్జ్ గురువు బి. సరోజినీ, డా.హిప్నో పద్మా కమలాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువులు బొబ్బిలి సరోజిని, సి.శ్రీలత, వై. ఝాన్సీ, వి.యశోదని డా.హిప్నో పద్మా కమలాకర్, పూర్ణ, గీత, కృష్ణ వేణి, హిత, స్వరూప రాణి, రామారావు, రాజేంద్ర కుమార్, ప్రకాష్, సింగ్, వేంకటేశ్వర రావు, సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. సమాజాభివృద్ధిలో ఎంతోమంది మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే అటు ఇంట్లో, ఇటు సమాజంలో మహిళలు ఉన్నతి సాధించాలంటే వారు శారీరకంగా, మానసికంగా.. ఆరోగ్యంగా, దృఢంగా ఉండడం చాలా అవసరమన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యంతోనే మహిళలు అన్నింటా శక్తిమంతులవుతారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.. ఐదు నిమిషాల పాటు సూర్య నమస్కారాలకు కేటాయిస్తే శరీరానికి చక్కటి వ్యాయామం అందుతుందన్నారు. శరీరంలోని అన్ని అవయవాలూ శుద్ధి అవుతాయని, అలాగే మానసికంగానూ దృఢంగా మారతారన్నారు. కాబట్టి ప్రతి మహిళా యోగాను ఓ అలవాటుగా మార్చుకోవాలని తెలిపారు.. ఒకవేళ రోజూ చేయడం వీలు కాని పరిస్థితుల్లో వారానికి కనీసం ఐదు రోజులైనా యోగా చేసేలా ప్రణాళిక వేసుకోవాలన్నారు. మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలంటే కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢంగా తయారు కావాలన్నారు. ఇందుకోసం చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలన్నారు. అలాగే ఏ వయసులో ఉన్న వారు ఆ వయసుకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.
* శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు కావడానికి వ్యాయామం ఎంతగానో సహకరిస్తుందన్నారు. వ్యాయామం చేసే క్రమంలో శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్, పోషకాలు బాగా సరఫరా అవుతాయని, తద్వారా గుండె, వూపిరితిత్తుల పనితీరు మెరుగవుతుందన్నారు. అలాగే కండరాలు దృఢంగా తయారవడంతో పాటు శరీరానికి శక్తి అందుతుందని, వ్యాయామం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగి బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చునని తెలిపారు.
వ్యాయామం చేసే క్రమంలో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుందని, తద్వారా గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చన్నారు.. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓ అరగంట పాటు వ్యాయామం చేయడం ద్వారా మెదడులో విడుదలయ్యే కొన్ని రకాల రసాయనాల వల్ల మనసు రిలాక్సవుతుందని, దీంతో పాటు శరీరంలో కొత్త శక్తి ఉత్పత్తవుతుందన్నారు. కాబట్టి రోజూ ఎదురయ్యే ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడాన్ని రోజువారీ పనుల్లో భాగం చేసుకోవాలని తెలిపారు. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోయినట్త్లె నిద్ర కూడా సుఖంగా, ప్రశాంతంగా పడుతుందన్నారు.వీటితో పాటు ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండడం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండచ్చు అని తెలిపారు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్
9390044031







Friend
Meeru super madam .