World Menstrual Hygiene Day 2022 : MAY 28
- Mind and Personality Care

- Jun 12, 2022
- 2 min read
*రుతు క్రమం గురించి చెప్పడం అందరి బాధ్యత*
మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి
డా.అనురాధ, డా.హిప్నో పద్మా కమలాకర్
రుతు క్రమం గురించి చెప్పడం అందరి బాధ్యతని మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ప్రపంచ ఋతుక్రమ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కృష్ణ కుమారి, సింధూ పాల్గొన్నారు. అమ్మాయి లందరకి శానిటరీ పాడ్స్ ఇవ్వడం జరిగింది.
ఆమె మాట్లాడుతూ ఋతుస్రావం అనేది ప్రతి నెలా జరిగే ప్రక్రియ న్నారు. ఆ ప్రత్యేక రోజులలో మహిళలు/అమ్మాయిలలో పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి మరియు ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటారన్నారు. పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత పాటించడం ద్వారా ఆ కాలంలో ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. సాధారణంగా, స్త్రీల ఋతుస్రావం 28 రోజులలోపు వస్తుంది మరియు దాని కాలం ఐదు రోజులు. ఈ కారణంగా, సంవత్సరంలో ఐదవ నెల అయిన ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకోవడానికి మే 28వ తేదీని ఎంచుకున్నారన్నారు. కాలం మారుతున్నా పీరియడ్స్ గురించి చాలా మందికి ఎన్నో అపోహలున్నాయి. దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందన్నారు. రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవాన్ని మొదటిసారిగా 2013లో జర్మన్ నాన్ ప్రాఫిట్ వాష్ యునైటెడ్ రూపొందించిందన్నారు. దీనిని 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజును జరుపుకుంటున్నారని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా, ప్రపంచ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం ఉద్యమం #ItsTimeForAction అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించి రుతుస్రావ ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై చర్య తీసుకోవాలని పిలుపునిచ్చిందన్నారు. ప్రతికూల సామాజిక నిబంధనలను మార్చడం ఈ రోజు లక్ష్యమని చెప్పారు.
డా.అనురాధ మాట్లాడుతూ రుతుస్రావం అనేది స్త్రీ శరీరంలో ఒక సహజ ప్రక్రియ. కానీ కొంతమంది కి ఈ సమయంలో పరిస్థితి ఇబ్బంది గా ఉంటుందన్నారు.. ఈ పీరియడ్స్ సమయంలో కొందరికీ ఎలాంటి సమస్యలు కలగకపోయినా.. మరికొంతమందికి మాత్రం పొత్తి కడుపునొప్పి, తీవ్రమైన రక్తస్రావం, నడుము నొప్పి, కాళ్లు చేతులు లాగడం, వాంతులు, వికారం, నీరసం వంటి ఎన్నో సమస్యలు కలుగుతాయి. కానీ ఇలాంటి సమయంలోనే ఆడవారు మరింత పరిశుభ్రతను పాటించాలన్నారు. రుతుస్రావ పరిశుభ్రత గురించి చాలా మందికి ఇప్పటికీ స్పష్టమైన ఆలోచన లేదన్నారు.
ఋతుస్రావం అయిన తర్వాత తరచుగా ప్లాడ్ లను తరచుగా మార్చుకుంటూ ఉండాలి. ఇది ఎన్నో అంటువ్యాధులతో సహా ఇతర వ్యాధులను కలిగిస్తుంది. కాబట్టి ప్యాడ్ లను ఎక్కువ సేపు ఉపయోగించవద్దు.
స్కూలుకు వెళ్లే పిల్లలు లో దుస్తులను, ఎక్కువ ప్యాడ్ లను తీసుకెళ్లాలి. ప్రతి నాలుగైదు గంటలకు ఒకసారైనా ప్యాడ్ ని మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పీరియడ్స్ సమయంలో మీ ప్రైవేట్ భాగాలను శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రమైన నీటితో కడగాలి. లేదంటే ఇన్ఫెక్షన్ బారిన పడతారు.
శానిటరీ న్యాప్కిన్లను తొలగించడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. ఉపయోగించిన ప్యాడ్ లను గట్టి కవర్ లో చుట్టి పారేయాలి. వాటిని స్టోర్ చేయడం మంచిది కాదు.
రుతుస్రావం సమయంలో ప్రైవేట్ భాగాలకు దగ్గరగా ఉన్న వెంట్రుకలను తొలగించడం ఉత్తమం. లేదంటే ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
రుతుస్రావం సమయంలో మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో జంక్ ఫుడ్ ను తీసుకోకూడదు. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్నితినాలి. కాకపోతే ఇది శరీరంలో పోషకాల వ్యక్తీకరణకు దారితీస్తుంది. రుతుస్రావం సమయంలో నొప్పిని కలిగిస్తుంది.
డా.హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ
సాధారణ శరీర పనితీరు కారణంగా స్త్రీలు మరియు బాలికలు విద్యను పొందడం, జీవనోపాధి పొందడం ఇప్పటికీ నిషేధించబడటం క్షమించరాని విషయమన్నారు.
ప్రీమెన్‌స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్ (పిఎమ్‌డిడి) అనేది ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎమ్‌ఎస్) మాదిరిగానే ఉంటుంది కానీ మరింత తీవ్రమైనది న్నారు. మీ పీరియడ్స్ ప్రారంభమయ్యే వారం లేదా రెండు వారాలలో PMDD తీవ్రమైన చిరాకు, నిరాశ లేదా ఆందోళనను కలిగిస్తుందన్నారు. పీరియడ్స్ ప్రారంభమైన రెండు మూడు రోజుల తర్వాత ఈ లక్షణాలు సాధారణంగా అదృశ్యమవుతాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 1.8 మిలియన్ల మంది మహిళలు ప్రతి నెలా రుతుక్రమానికి గురవుతున్నారు, అయితే వారిలో చాలామంది రుతుచక్రాన్ని సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండటంలో లో విఫలమవుతున్నారని తెలిపారు. దీనికి అతిపెద్ద కారణం సామాజిక అవమానం- రుతుక్రమం సమయంలో వేధింపులు మరియు సామాజిక బహిష్కరణ. నేటికీ పీరియడ్స్ సమయంలో పాత బట్టలు ఉతికి మళ్లీ మళ్లీ వాడే అమ్మాయిలు ఎందరో ఉన్నారు. కానీ అది అస్సలు చేయకూడదు. ఇది ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని నాటకీయంగా పెంచుతుంది. ఈ రోజుల్లో మీరు మీ మంచం యొక్క పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవాలి. దీనితో పాటు, బెడ్‌షీట్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. తద్వారా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందన్నారు. అమ్మాయి గా ఉన్నప్పుడే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తులో అమ్మగా మంచి బిడ్డలను అందించగలరన్నారు. ఇటు వంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్లో, కళాశాలలో చేయాలని సునీతా లక్ష్మారెడ్డిని కోరారు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్ హిప్నో థెరపిస్ట్
9390044031













Comments