Youth's life is gray with tobacco
- Mind and Personality Care

- May 30, 2023
- 1 min read
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31న సందర్భంగా
పొగాకుతో యువత జీవితం మసి
ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా*అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్
పొగాకుతో యువత జీవితం మసి అవుతుందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31న సందర్భంగా నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్ట్స సంఘ ప్రధాన కార్యదర్శి పి.రమేష్ కుమార్, సైన్స్ టీచర్ పి.సురేష్ కుమార్, డా.పి.స్వరూపా రాణి, జి.కృష్ణ వేణి విద్యార్థులు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ పొగాకులో విష పదార్థాలు రోగనిరోధక వ్యవస్థను బలహినం చేస్తాయన్నారు. ఈ మధ్య కాలంలో యుక్త వయసులోనే గుండెజబ్బులు ఎక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.అకాల మృత్యువుకు కారణాలలో గుండెజబ్బు మూడో స్థానంలో ఉందని చెప్పారు.పొగాకు వల్ల ఆందోళన, ఒత్తిడి పెరగడం, ఏకగ్రత, జ్ఞాపకశక్తి తగ్గడం జరుగుతుందని తెలిపారు. హెచ్సీవీ, క్యాన్సర్లుకు ధారితీయొచ్చని చెప్పారు. దీని మూలంగా శుక్రకణాలుదెబ్బతిని, సంతానం కలగటమూ కష్ట మవుతుందని తెలిపారు.ఇంట్లో ఎవరైనా సిగరెట్లు కాలుస్తుంటే వీటి నుంచి వెలువడే పొగను గర్భిణులు పీల్చుకోవడం వల్ల పిండం ఎదుగుదల కుంటుపడొచ్చొని చెప్పారు. ఇటీవల ఫ్రీ వెడ్డింగ్ షూట్ లో పొగతాగుతూ తీస్తున్నారు. పెద్దలు ఆలోచించి, పిల్లల అలవాట్లను ఒక కంట కనిపెట్టి, వారి జీవితం కాలాన్ని పెంచగలరు. ఆడవారిలో పొగతాగే అలవాటు బాగా పెరుగుతుందన్నారు. మీరు ఆరోగ్యంగా ఉంటే సమాజం బాగుపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్ట్స సంఘ ప్రధాన కార్యదర్శి పి.రమేష్ కుమార్ మాట్లాడుతూ పొగాకు వాడకం వల్ల జీవనకాలమూ పదేళ్లు తగ్గుతుందని చెప్పారు. 'చాలారోజులుగా తాగుతున్నాం కదా. ఏమీ అవలేదు కదా. ఏమీ కాదు' అనుకోవద్దని చెప్పారు. ఏ వయసువారైనా పొగ అలవాటునుమానెయ్యటం మేలని తెలిపారు. సైన్స్ టీచర్ పి.సురేష్ కుమార్ మాట్లాడుతూ చిన్న వయసులోనే పొగాకు వాడకం బాగా పెరిగిందని చెప్పారు. తల్లి దండ్రులు జాగ్రత్త పడకపోతే పిల్లలు అంతమైపోయో ప్రమాదముందని హెచ్చరించారు. మనదేశంలో జబ్బులకు, మరణాలకు కారణమవుతున్న ప్రధాన అంశాల్లో పొగాకు అలవాటు ఒకటని చెప్పారు.. దీని మూలంగా ఏటాసుమారు 13.5 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్, సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్@ 9390044031







Comments